Breaking News

ఫుల్‌ ట్రాఫిక్‌..అందరూ చూస్తుండగానే రూ.40 లక్షలు స్వాహా!

Published on Tue, 03/07/2023 - 15:38

అందరూ చూస్తుండగానే ఏ మాత్రం భయం లేకుండా చోరికి యత్నించారు. అదికూడా ఒక బైకర్‌ని అనుసరించిన ముగ్గురు దుండగులు ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్దకు రాగానే సొత్తు చోరీ చేసి ఉడాయించారు. ఈ ఘటన మార్చి1న సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద రెండు కార్లు వాటి మధ్యలో ఓ బైక్‌ ఆగి ఉన్నాయి. ఇంతలో ముగ్గురు దుండగులు కామ్‌గా ఆ వాహనదారుడి వద్దకు వచ్చి గమనించడం  ప్రారంభించారు.

ఇంతలో అతని భూజానికి తగిలించి ఉన్న బ్యాగ్‌ని నెమ్మదిగా ఓపెన్‌ చేసి సుమారు రూ. 40 లక్షలు కొట్టేశారు. జస్ట్‌ నాలుగే నాలుగు నిమిషాల్లో డబ్బుల కొట్టేసి జారుకున్నారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. కాసేపటికి అసలు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు రంగలోకి దిగిన పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించడంతో ఈ ఘటన మొత్తం బయటపడింది. దీంతో పోలీసులు ఆ నిందితుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని సుమారు రూ. 38 లక్షలు రికవరీ చేశారు. నిందితులను ఆకాశ్‌, అబిషేక్‌గా గుర్తించారు. ఆ ముఠా వాహనదారులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

(చదవండి: ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ రహస్య సమాజం: రాహుల్‌ గాంధీ)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)