Breaking News

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నాలుగు బిల్లులపై చర్చ?

Published on Wed, 11/08/2023 - 19:55

ఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. బ్రిటీష్‌ కాలం నాటి చట్టాలకు చెల్లుచీటి ఇస్తూ.. వాటి స్థానంలో కొత్త చట్టాలను తేవాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల బిల్లులతో పాటు పెండింగ్‌లో ఉన్న మరో వివాదాస్పద బిల్లును సైతం  పరిశీలించే యోచనలో ఉంది కేంద్రం.

మొత్తం 12 రోజులపాటు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారు కాబోతున్నట్లు సమాచారం. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ ముగిశాకనే ఈ సమావేశాలు మొదలుకానున్నాయి. క్రిస్మస్‌లోపు.. అదీ డిసెంబర్‌ 22 లోపే సమావేశాలు ముగించేయలని భావిస్తోంది కేంద్రం. దీంతో రెండు వారం నుంచి సెషన్‌ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, CRPC స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, ఎవిడెన్స్‌ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం తీసుకురావాలనుకుంటోంది కేంద్రం. ఇప్పటికే వీటిని కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గత వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసినా విపక్షాల, మాజీ ఎన్నికల కమీషనర్ల వ్యతిరేకతతో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది.

చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల హోదాను కేబినెట్ కార్యదర్శికి సమానంగా తీసుకురావాలనేది ఈ బిల్లు ఉద్దేశ్యం. దాంతోపాటు ఎన్నికల కమీషనర్ల నియామక విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కమీషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఉంది. ఈ బిల్లు ఆమోదిస్తే కేబినెట్ సెక్రటరీ హోదా లభిస్తుంది. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు