మే మొదటి వారంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన

Published on Wed, 04/27/2022 - 19:36

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ల్లో పర్యటించనున్నారు. బెర్లిన్‌లో ప్రధాని మోదీ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

అంతేకాకుండా వారిద్దరూ భారతదేశం- జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) ఆరవ ఎడిషన్‌కు సహ-అధ్యక్షులుగా ఉంటారు. ఇది ఛాన్సలర్ స్కోల్జ్‌తో ప్రధాని మొదటి సమావేశం. కాగా ఈ ఏడాది ప్రధాని మోదీకి ఇదే తొలి విదేశీ టూర్‌. చివరగా గతేడాది నవంబర్‌లో గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సుకు ఆయన హాజరయ్యారు.


 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ