amp pages | Sakshi

యూపీ పీఠానికి ఎక్స్‌ప్రెస్‌వే ఇదేనా? 

Published on Wed, 11/17/2021 - 02:10

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు గడువు ఉందనగా 341 కి.మీ. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేని ప్రారంభించిన ప్రధాని మోదీ ఎన్నికల సమరశంఖం పూరించారు. తూర్పు యూపీలోని లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్‌పూర్, అంబేద్కర్‌ నగర్, అజమ్‌గఢ్, మావూ, ఘాజీపూర్‌ జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్నే రాష్ట్రానికే ఆర్థికంగా అండదండ ఉండేలా మార్చడానికి వ్యూహరచన చేసిన బీజేపీ పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణాన్ని ప్రారంభించింది. ఎన్నికలు ముంచుకొస్తూ ఉండడంతో ఇంకా సదుపాయాలు పూర్తిగా కల్పించకుండా ఆగమేఘాల మీద ప్రారంభోత్సవం నిర్వహించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలోని ఎనిమిది ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడర్ల నిర్మాణానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సిద్ధమయ్యారు. 

రైతుల ఆందోళనలకు అభివృద్ధితో చెక్‌..! 
యూపీలో 403 స్థానాలకు గాను పూర్వాంచల్‌ ప్రాంతంలో 160 స్థానాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రతిపక్ష ఎస్‌పీ, బీఎస్‌పీలకే ఒకప్పుడు పట్టు ఉంది. 2017 ఎన్నికల్లో మోదీ మ్యాజిక్‌తో బీజేపీ ఈ ప్రాంతంలో మెజార్టీ సీట్లు సాధించి విపక్షాలకు చెక్‌ పెట్టింది. అజమ్‌గఢ్, అంబేద్కర్‌ నగర్‌లో ఎస్పీ, బీఎస్‌పీల ధాటికి నిలవలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో తన పట్టు కొనసాగించడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ‘వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో రైతుల ఆందోళన, ఎస్‌పీతో రాష్ట్రీయ లోక్‌దళ్‌ జత కట్టడం వల్ల పశ్చిమ యూపీలో ఆశించిన స్థాయిలో సీట్లు రావనే భయం బీజేపీలో ఉంది. తూర్పున ఎవరి గాలి వీస్తే వారికే ఈ సారి యూపీ పీఠం దక్కే అవకాశం ఉంది.

అందుకే బీజేపీ ఈ ప్రాంతంపైనే అత్యధికంగా దృష్టి సారించింది’ అని రాజకీయ విశ్లేషకుటు ఎస్‌.కె శ్రీవాస్తవ అన్నారు. ఈ ప్రాంతంలో అజంగఢ్, అంబేద్కర్‌ నగర్, ఘజియాపూర్, మావూ, సుల్తాన్‌పూర్‌ జిల్లాల్లో తమ పార్టీ బలహీనపడిందని బీజేపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు అజంగఢ్‌లో యూనివర్సిటీ, ఖుషీనగర్‌లో విమానాశ్రయం, సిద్ధార్థ్‌నగర్‌లో మెడికల్‌ కాలేజీ , గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్, వారణాసిలో కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఎక్స్‌ప్రెస్‌ వే ప్రత్యేకతలు 
► లక్నో– సుల్తాన్‌పూర్‌ హైవే మీదనున్న చాంద్‌సరాయ్‌ గ్రామం నుంచి ఈ హైవే మొదలవుతుంది. మొత్తం 341 కి.మీ. దూరం ఉన్న ఈ హైవే ఘజియాపూర్‌ జిల్లా హల్‌దారియా వరకు కొనసాగుతుంది.  
► లక్నో, బారాబంకి, అమేథి, అయోధ్య, సుల్తాన్‌పూర్, అంబేద్కర్‌ నగర్, ఆజమ్‌గఢ్, మావూ, ఘాజీపూర్‌ జిల్లాల మీదుగా సాగుతుంది.  
► దీని నిర్మాణానికి 2018 జులైలో ఆజంగఢ్‌ వద్ద మోదీ శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు అయింది 
► ఆరు లేన్లతో నిర్మించిన దీనిని ఎనిమిది లేన్లకు విస్తరించుకునే అవకాశం ఉంది. 
► ఈ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి రాకపోకలు సాగిస్తే లక్నో నుంచి ఘజియాపూర్‌కు పట్టే ప్రయాణం ఆరు గంటల నుంచి 3.5 గంటలకు తగ్గిపోతుంది. 
► ప్రతీ వంద కిలోమీటర్లకి ప్రయాణికులు సేదతీరడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంక్‌లు, టాయిలెట్‌ సదుపాయాలు, మోటార్‌ గ్యారేజ్‌లు ఏర్పాటు చేస్తారు.  
► దేశ అత్యవసర పరిస్థితుల్లో వాయుసేనకు చెందిన యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ కోసం సుల్తాన్‌పూర్‌ జిల్లా కుదేబహార్‌లో 3 కి.మీ.ల పొడవైన రన్‌ వే నిర్మించారు 
► 18 ఫ్లై ఓవర్లు, ఏడు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, ఏడు పొడవైన వంతెనలు , 104 చిన్న వంతెనలు, 13 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌ మార్గాలు ఉన్నాయి. ఇక హైవేపై రోడ్డుకు ఇరువైపులా ప్రయాణించడానికి వీలుగా 271 అండర్‌పాసెస్‌ ఉన్నాయి.    
    – నేషనల్‌ డెస్క్, సాక్షి   

Videos

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)