amp pages | Sakshi

లఖిమ్‌పూర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

Published on Tue, 11/09/2021 - 02:00

సాక్షి, న్యూఢిల్లీ: లఖిమ్‌పూర్‌ ఖేరి ఘటనలో ఉత్తరప్రదేశ్‌ సిట్‌ దర్యాప్తును నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా రోజువారీ పర్యవేక్షించడానికి మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమిషన్‌పై సంతృప్తిగా లేమని పేర్కొంది. లఖిమ్‌పూర్‌ఖేరి ఘటనపై సోమవారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఘటనపై న్యాయ పర్యవేక్షణకు పంజాబ్‌ హరియాణా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులైన జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ జైన్‌ లేదా జస్టిస్‌ రంజిత్‌ సింగ్‌లలో ఒకరిని నియమిస్తామని ధర్మాసనం పేర్కొంది. సిట్‌ దర్యాప్తును పర్యవేక్షించడానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్‌పై విశ్వాసం లేదని పేర్కొంది.

అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌కుమార్‌ శ్రీవాస్తవతో కూడిన ఏక సభ్య న్యాయ కమిషన్‌ యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. ‘రైతులపై నుంచి వాహనం దూసుకెళ్లడం, రైతుల ఆగ్రహించి బీజేపీ కార్యకర్తలను హతమార్చిన వేర్వేరు ఘటనలపై వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనప్పటికీ సాక్షుల విచారణ కలిపి జరుగుతోందని భావిస్తున్నాం. ప్రత్యేకించి ఒక నిందితుడిని కాపాడడానికే ఇలా జరుగుతోంది అని అనిపిస్తోంది. అందుకే కేసులో ఆధారాలు మిళితం కాలేదని నిర్ధారించడానికి, దర్యాప్తును పర్యవేక్షించడానికి ఇతర రాష్ట్రానికి చెందిన హైకోర్టు మాజీ జడ్జిని నియమించాలని భావిస్తున్నాం. దీనిపై శుక్రవారంలోగా యూపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.   

విడివిడిగా దర్యాపు చేయాల్సిందే 
ఈ కేసులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ నిందితుడిగా ఉన్నారు. ఘటనలో రైతుల హత్య, జర్నలిస్టు హత్య, రాజకీయ కార్యకర్తల హత్య ఇలా మూడు ఉన్నాయని పేర్కొంది. ‘మూడో కేసుకు సంబంధించి పరిశోధన సిట్‌ కొనసాగించలేకపోతోందని అనుకుంటున్నాం. ఇలాంటి గందరగోళంలో స్వతంత్ర న్యాయమూర్తుల పర్యవేక్షణ సబబని భావిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. విడివిడిగా దర్యాప్తు చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది. తాజా పరిస్థితి నివేదికను పరిశీలించామని, మరికొంత మంది సాక్షులను విచారించాల్సి ఉందని పేర్కొనడం తప్ప మరేమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పది రోజులు సమయం ఇచ్చినా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలు రాలేదని, కోర్టు అనుకున్నట్లుగా దర్యాప్తు సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీఐ విచారణ అవసరం లేదని పునరుద్ఘాటిస్తూ... ఈ కేసుకు రాజకీయ డిమాండ్లను జోడించదలచుకోలేదని, రిటైర్డ్‌ జడ్జీతో స్వతంత్ర పర్యవేక్షణ కోరుకుంటున్నామని తెలిపింది.

రాష్ట్రప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవడానికి సమయం ఇవ్వాలని యూపీ తరఫు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే కోరారు. విచారణ నిమిత్తం ఎనిమిది సెల్‌ఫోన్లు తీసుకున్నామని,  ఈ నెల 15 లోగా ఫోరెన్సిక్‌  నివేదికలు అందజేస్తామని సాల్వే తెలిపారు. ఆశిష్‌ ఫోన్‌ మాత్రమే సీజ్‌ చేశారని, మిగిలిన నిందితుల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరం లభ్యం కాలేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒక నిందితుడి ఫోన్‌ స్వాధీనం చేసుకొని మిగిలినవి సాక్షులవి స్వాధీనం చేసుకుంటారా అని నిలదీసింది.  రాజకీయ కార్యకర్త శ్యాంసుందర్‌ మృతి చెందడంపై సీబీఐ విచారణ చేపట్టాలని మరో న్యాయవాది కోర్టును కోరగా... అన్ని సమస్యలకూ సీబీఐ పరిష్కారం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  తదుపరి విచారణ వరకూ వేచిచూడాలని నిష్పాక్షిమైన దర్యాప్తు జరగడానికి ప్రయతిస్తున్నామని పేర్కొంది. ‘‘రెండు కేసుల్లో అవే సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయడం ద్వారా ఒక నిర్దిష్ట నిందితుడికి ప్రయోజనం చేకూర్చాలని భావించినట్లు ప్రాథమికంగా భావించాల్సి వస్తోంది. వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల సాక్ష్యాలు కలగలిసిపోతున్నాయని అనిపిస్తోంది. ఇలా వ్యాఖ్యానించినందుకు మరోలా భావించొద్దు. ఒక ఎఫ్‌ఐఆర్‌లో సాక్ష్యాలు మరో దాంట్లో ఉపయోగించొచ్చు అంటున్నారు. అప్పుడు కేసు ఏం కావాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కారు దూసుకెళ్లడంతోనే జర్నలిస్టు హత్య: లఖింపూర్‌ ఘటనలో కారు దూసుకెళ్లడంతోనే జర్నలిస్టు మృతి చెందినట్లు భావిస్తోందని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వం తరఫు లాయర్‌ హరీష్‌ సాల్వే ఏకీభవించారు. మూకదాడి వల్ల మృతిచెందారని తొలుత భావించామని కానీ అలా కాదని సాల్వే తెలిపారు.   

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)