కేరళ అసెంబ్లీ ఎన్నికలు: తొలి లిస్ట్‌ను ప్రకటించిన సీపీఐ!

Published on Wed, 03/10/2021 - 13:23

తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ తమ అభ్యర్థులను ప్రకటించింది. 25 అసెం‍బ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించిన అధిష్టానం, 21 మందితో కూడిన జాబితాను ప్రకటించినట్లు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కనమ్‌ రాజేంద్రన్‌ తెలిపారు. ‘‘తొలుత 21 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించాం. మరో నాలుగు శాసన సభ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ఎన్నిస్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టామనేది కాకుండా, ఎన్నిచోట్ల గెలిచామన్నదే ప్రధానమన్నారు.

అయితే పునలూర్‌ నుంచి, జిఎస్‌ జయలాల్‌ చత్తనూర్‌ నుంచి పోటీపడనున్నారు. కాగా, ఇకే విజయన్‌ నాదపురం బరిలో దిగారు. కాగా ఆయా అభ్యర్థులు తమకు కేటాయించిన స్థానాల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఇక కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 6 ఎన్నికలు జరుగనున్నాయన్న విషయం తెలిసిందే. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.

చదవండి: కొత్త సీఎంపై వీడిన ఉత్కంఠ

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ