amp pages | Sakshi

117 ఏళ్ల దేశ తొలి ఓట‌రు ఇక లేరు.. బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 3 రోజులకే..

Published on Sat, 11/05/2022 - 10:20

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నవంబర్‌ 12న ఒకే విడతలో పోలింగ్‌​ జరగనుండగా.. డిసెంబర్‌ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో భారత్‌కు స్వాతంత్ర్యం అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసిన శ్యామ్‌ శరణ్‌ నేగి మరణించారు. ఆయన వయసు 106 సంవత్సరాలు. కాగా ఆయన మూడు రోజుల క్రితమే(నవంబర్‌ 2) హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా 34 సారి తన ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

తొలుత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల‌ని శ్యాం శ‌ర‌ణ్ భావించినా.. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఇంటి నుంచి ఓటు వేసేందుకు అనుమ‌తించాల‌ని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కిన్నౌర్ జిల్లాకు చెందిన శ్యాం శ‌ర‌ణ్ నేగి కోసం ఎన్నిక‌ల క‌మిష‌న్ బృందం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. అప్పటికే శ్యామ్‌ అనారోగ్యంతో బాధపడుతుండగా.. శనివారం ఉదయం తన స్వస్థలమైన కల్పాలో కన్నుమూశారు. వృద్ధుడి అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోందని, గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు.

శ్యామ్‌ శరణ్‌ నేగి జూలై 1, 1917న జన్మించారు. కల్పాలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1947లో బ్రిటిష్‌ పాలన ముగిసిన తరువాత స్వాతంత్ర్య భారతదేశంలో జరిగిన మొదటి ఎన్నికల్లో ఓటు వేసిన తొలి వ్యక్తి శరణ్‌ నేగి. 1951 అక్టోబర్‌ ‌ 25న ఆయన ఓటేశారు. అయితే మొదటిసారి ఎన్నికల పోలింగ్‌ 1952లో ఎక్కువ జరిగినప్పటికీ హిమాచల్‌ ప్రదేశ్‌ అయిదు నెలల ముందగానే ఎన్నికలకు వెళ్లింది. హిమాచల్‌లో ఫిబ్రవరి, మార్చిలో వాతావరణం ప్రతికూలంగా ఉండటం, అతిగా మంచు కురిసే ప్రమాదం ఉండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాక శ్యామ్ శరణ్ నేగి హిందీ చిత్రం సనమ్ రేలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌