amp pages | Sakshi

----------

Published on Sat, 11/18/2023 - 10:57

చండీగఢ్‌: మనోహర్ పారికర్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కేటాయించాలని హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొంది. న్యాయస్థానం తీర్పుపై స్పందించిన ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. 

ప్రైవేటు రంగంలో స్థానికులకే 75 ఉద్యోగాలు కేటాయించాలని ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఆర్టికల్ 14, 19లకు ఆటంకం కలిగిస్తుందని ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చట్టం పూర్తిగా అసంబద్ధంగా ఉందని కొట్టేసింది. రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది. 

ప్రవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం తప్పనిసరి చేస్తూ 2020 నవంబర్‌లో హర్యానా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం 2021 మార్చిలో గవర్నర్‌ అనుమతి పొందింది. 2022 జనవరి నుంచి ఇది అమలులోకి వచ్చింది. ప్రవేటు రంగంలో స్థానికులకే ఉద్యోగాలు అంశం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జననాయక్ జనతా పార్టీ ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి. 

ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్‌ చట్టంపై 2022 ఫిబ్రవరిలోనే హర్యానా హైకోర్టు స్టే విధించింది. అప్పట్లోనే ఈ స్టేపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ చేసింది.. కాగా.. హైకోర్టు స్టేను సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ప్రకారం రూ.30,000లకు మించని  ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కేటాయించాల్సి ఉంటుంది. నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది.   

ఇదీ చదవండి: Aaditya Thackeray: ఆదిత్య థాక్రేపై కేసు నమోదు


 

Videos

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?