amp pages | Sakshi

ఐశ్వర్య, అమర్త్య ఎంగేజ్‌మెంట్‌

Published on Thu, 11/19/2020 - 14:08

సాక్షి, బెంగళూరు దివంగత కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు, బీజేపీ నాయకుడు ఎస్.ఎం.కృష్ణ మనవడు అమర్త్య హెగ్డేతో కర్ణాటక మాజీ మంత్రి, కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య (22) నిశ్చితార్థ వేడుక గురువారం పూర్తయింది. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాల సన్నిహితులు పాల్గొన్నారు. కర్నాటక  ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ కార్యక్రమానికి హాజరై   కాబోయే జంటను ఆశీర్వదించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో వీరి వివాహం చేసేందుకు నిశ్చయించారు.

చిన్ననాటి స్నేహితులైన  సిద్ధార్థ, శివకుమార్‌  వియ్యమందాలని గతంలోనే భావించారు. అయితే అనూహ్యంగా సిద్దార్థ ఆ‍త్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. దీంతో  వివాహాన్ని అనివార్యంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.  ఆ తరువాత  కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ ఆంక్షలు అడ్డొచ్చాయి.  తాజాగా అన్ని  అడ్డంకులను అధిగమించి అమర్త్య హెగ్డే - ఐశ్వర్య వివాహాన్ని ఖాయం చేసుకున్నారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన సిద్ధార్థ కుమారుడు తల్లి మాళవికతో కలిసి  తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. అటు ఐశ్వర్య డీకే శివకుమార్ స్థాపించిన ఇంజనీరింగ్ కళాశాల గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీని నిర్వహిస్తున్నారు. కాగా వీజీ సిద్దార్థ గత ఏడాది జూలై 2019 లో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆర్థిక సమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు  తేల్చిన సంగతి తెలిసిందే.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)