amp pages | Sakshi

Congress: ఎన్నికల్లేవ్‌.. ఖర్గేకు ఫ్రీహ్యాండ్‌? అయినా లుకలుకలు

Published on Fri, 02/24/2023 - 15:46

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీబ్ల్యూసీ) విషయంలో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారా?. అలాంటి కమిటీకి సభ్యుల ఎంపిక కోసం ఎన్నిక నిర్వహించకూడదని పార్టీ చీఫ్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా?. రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌) పార్టీ ప్లీనరీ వేదికగా మరోసారి కాంగ్రెస్‌ లుకలుకలు బయటపడ్డాయా?.. 

సీడబ్ల్యూసీకి ఎన్నికతో కాకుండా.. నేరుగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించిన అభ్యర్థులను కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని సీనియర్‌ నేత, కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ ఇంచార్జి సెక్రటరీ జైరాం రమేశ్‌ శుక్రవారం వెల్లడించారు. మొత్తం 45 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు హాజరైన సమావేశం.. మూడు గంటలపాటు వాడీవేడిగా సాగినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ ఎన్నిక విషయంలో ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వివరించినట్లు తెలుస్తోంది. అయితే చివరకు నిర్ణయం.. ఏకగ్రీవ ఆమోదం పొందలేని కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. 

అజయ్‌ మాకెన్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, దిగ్విజయ్‌ సింగ్‌ లాంటి సీనియర్ల సీబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని రాయ్‌పూర్‌(ఛత్తీస్‌ఘడ్‌)లో జరిగిన 85వ ప్లీనరీ సందర్భంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో సింఘ్వీ మాత్రం 2024 ఎన్నికల తర్వాత అయినా పర్వాలేదని ప్లీనరీలో సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఖర్గే ఎంపిక చేసిన జాబితానే సీడబ్ల్యూసీ కోసం కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ ద్వారా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో.. దళారీ సంస్కృతిని తొలగించేందుకు పార్టీ చేస్తున్న పోరాటానికి మరోసారి ద్రోహం జరిగిందంటూ కొందరు సీనియర్లు రగిలిపోతున్నారు. స్టీరింగ్‌ కమిటీకి సూచనలకు ప్రాధాన్యం ఇవ్వనప్పుడు.. అభిప్రాయ సేకరణ ఎందుకని నిలదీస్తున్నారు. మరోవైపు.. 

కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేదన్న విషయం బయటకు పొక్కడంతో.. కాంగ్రెస్‌ నేతలు మీడియాకు వివరణలు ఇస్తున్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంపై నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలనే యత్నంలో ఉన్నాం. అని సీనియర్‌ నేత దినేశ్‌ గుండు రావు తెలిపారు. 

ఇదిలా ఉంటే రాయ్‌పూర్‌ ప్లీనరీకి స్టీరింగ్‌ కమిటీ సభ్యులైన.. సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్‌, తనయ ప్రియాంక గాంధీ వాద్రా దూరంగా ఉన్నారు. ఖర్గేకు ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్లు దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే శని, ఆదివారాల్లో జరగబోయే ప్లీనరీకి ఈ కీలక నేతలంతా హాజరుకావొచ్చని భావిస్తున్నారు. మరోవైపు పార్టీ రాజ్యాంగానికి 30 సవరణలు చేసింది రాయ్‌పూర్‌ ప్లీనరీలో. అందులో గ్రామ, మండల, వార్డ్‌ స్థాయిలో పార్టీ యూనిట్‌ల ఏర్పాటు అనే ప్రధాన అంశం కూడా ఉంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)