amp pages | Sakshi

టీకా తీసుకుంటే ప్రాణాలకు ముప్పుండదు

Published on Sat, 07/17/2021 - 02:44

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. అదే విధంగా టీకా తీసుకున్నవారికి ప్రాణాలకు ముప్పు రాలేదని ఆ అధ్యయనం తెలిపింది. అత్యధికులకి కరోనా వైరస్‌ సోకడానికి డెల్టా వేరియెంటే కారణమని పేర్కొంది. దేశంలో వ్యాక్సిన్‌ కార్యక్రమం మొదలయ్యాక జరిగిన అతి పెద్ద అధ్యయనం ఇదే.

కరోనా మరో ముప్పు రాకుండా ఉండాలంటే త్వరితగతిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమయ్యేలా చూడాలని ఆ అధ్యయనం పేర్కొంది. దీనివల్ల దేశ ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుందని తెలిపింది. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ ఒక్క డోసు, లేదంటే రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనా సోకిన 677 మంది శాంపిల్స్‌ని పరీక్షించింది. అందులో 86.09 మందికి డెల్టా వేరియెంట్‌ సోకింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆల్ఫా వేరియెంట్‌ తీవ్ర ప్రభావాన్ని చూపించిందని తెలిపింది. కరోనా సోకిన వారిలో  9.8% మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.  ఇంక 0.4% మృతులు నమోదైనట్టు ఐసీఎంఆర్‌ అధ్యయనం తెలిపింది.  

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)