amp pages | Sakshi

ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్‌ కౌంటర్‌ 

Published on Mon, 10/30/2023 - 09:38

70 Hour Week Remark controversy:  వారానికి 70 గంటల పనిపై ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల దుమారం  ఇంకా కొనసాగుతూనే ఉంది. యువత వారానికి 70 గంటలు కచ్చితంగా పని చేయాలన్న వ్యాఖ్యలపై  అటు నెటిజన్లు నుంచి ఇటు పలు టెక్‌ దిగ్గజాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో ఎడిల్‌వీస్ సీఎండీ రాధికా గుప్తా స్పందించారు. భారతీయ మహిళలు దశాబ్దాల తరపడి 70 గంటలకు మించి పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదంటూ  విచారం వ్యక్తం చేశారు.

ఇంటి పని, ఆఫీసు పనిని బ్యాలెన్స్‌ చేసుకోవడంతోపాటు, తరువాతి తరం పిల్లలభవిష్యత్‌ను సక్రమంగా తీర్చిదిద్దుతూ చాలామంది భారతీయ మహిళలు 70 గంటల కంటే ఎక్కువే శక్తికి మించి పని చేస్తున్నారని రాధికా గుప్తా గుర్తు చేశారు. దశాబ్దాల తరబడి చిరునవ్వుతో ఓవర్‌ టైంని డిమాండ్‌ చేయకుండానూ అదనపుభారాన్ని మోస్తూనే ఉన్నారు. కానీ  విచిత్రంగా దాన్ని ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్‌పై చాలామంది సానుకూలంగా స్పందించారు.  ముఖ్యంగా ప్రముఖ బిజినెస్‌ ఎనలిస్ట్‌ లతా వెంకటేష్‌ స్పందిస్తూ నిజానికి, తన భర్త, తానూ  కూడా తమ కుమారుడి పెంపకంలో  చాలా సాయం చేశారు. అలాగే ముంబై లాంటి మహానగరాల్లో  పనికంటే మనం అందరం ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటూ పరోక్షంగా మూర్తి వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్‌ చేశారు. అవును అమ్మకు ఆదివారం లేదు.. వారాంతంలో కూడా పనిచేయాలని ఒకరు,  ఆఫీస్  పని లేకపోయినా కూడా భారతీ మహిళలు కుటుంబ పోషణ కోసం వారానికి 72 గంటలకు పైగానే పని చేస్తున్నారు.  చాలా కరెక్ట్‌గా చెప్పారు..అలుపెరుగని ఆడవారి శ్రమను ఎవరూ గుర్తించడం లేదంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ఇప్పటికైనా వారి కమిట్‌మెంట్‌ను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు మరో యూజర్‌.

అందరికంటే ముందు లేచేది అమ్మ.. అందరికంటే చివర్లో తినేది అమ్మే.. ఆఖరికి చివరగా నిద్రపోయేదీ అమ్మే అంటూ ఒక  యూజర్‌ కమెంట్‌ చేశారు. పితృస్వామ్యం అంతరించేంత వరకు ఈ వివక్ష పోదు. వెస్ట్రన్‌లో కూడా పూర్తి సమయం ఉద్యోగం చేసే మహిళలు ఇంట్లో బానిసలుగా ఉన్నారు. వీకెండ్‌లో పురుషులంతా పార్టీలు చేసుకుంటారు. అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూసే వరకు...ఏదీ మారదు మరోయూజర్‌ వ్యాఖ్యానించారు.

కాగా ఇన్ఫోసిస్ మాజీ  సీఈవో మోహన్‌దాస్ పాయ్‌తో  నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సందర్భంగా  అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా  మన  దేశం కూడా ఆర్థికంగా పుంజుకోవాలంటే యువత వారానికి 70 గంటలు తప్పనిసరిగా పనిచేయాలని నారాయణ మూర్తి సూచించారంటూ మీడియాలో పలు కథనాలు వెలు వడ్డాయి. దీంతో నెటిజన్లు చాలావరకు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయితే భవిష్‌ అగర్వాల్‌, జేఎస్‌డబ్ల్యూ సజ్జన్‌సిందాల్‌ సహా కొంతమంది పరిశ్రమ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)