amp pages | Sakshi

ఆస్తులే కాదు.. అప్పులూ ఉన్నాయి

Published on Sat, 07/10/2021 - 01:14

సాక్షి, న్యూఢిల్లీ: నూతన కేంద్ర మంత్రి వర్గంలో ఆస్తులే కాదు అప్పులు కూడా రూ.కోట్లలో ఉన్నవారు ఉన్నారని నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌/ఏడీఆర్‌ సంస్థ పేర్కొంది. తాజా మంత్రివర్గంలోని ప్రధాని సహా 78 మంది మంత్రులకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలోని సమాచారం మేరకు ఈ వివరాలు వెల్లడించినట్లు సంస్థ తెలిపింది. 

ఈ అంశాలపై దృష్టి..
తాజా మంత్రివర్గ విస్తరణలో 43 మంది కొత్త వారు చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఈ నివేదికలో మంత్రుల నేర, ఆర్థిక, విద్య తదితర అంశాలపై దృష్టి సారించినట్లు సంస్థ తెలిపింది. 33 మంది (42శాతం) మంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, అందులో 24 (31 శాతం) మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, హోంశాఖ సహాయ మంత్రి నిశిత్‌ ప్రమానిక్‌పై హత్య సంబంధిత కేసు కూడా ఉందని తెలిపింది.  70 మంది (90 శాతం) కోటీశ్వరులని, మంత్రుల సరాసరి ఆస్తుల విలువ రూ.16.24 కోట్లు అని నివేదికలో తెలిపింది. సర్బానంద సోనోవాల్, ఎల్‌. మురుగన్‌ల వివరాలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ల నుంచి సేకరించినట్లు సంస్థ పేర్కొంది. 

విద్య:  
12 మంది మంత్రులు తమ విద్యార్హతలు 8 నుంచి 12 మధ్యేనని పేర్కొనగా 64 మంది మంత్రులు గ్రాడ్యుయేషన్‌ అంతకన్నా ఎక్కువని, ఇద్దరు డిప్లొమా చదివినట్లు అఫిడవిట్‌లోపేర్కొన్నారు. 
ఎనిమిది పాస్‌: జాన్‌ బర్లా, నిశిత్‌ ప్రమానిక్‌ 
10 పాస్‌: బిశ్వేశ్వర్‌ తుడు, రామేశ్వర్‌ తేలి, నారాయణరాణే
12 పాస్‌: అమిత్‌ షా, అర్జున్‌ ముండా , పంకజ్‌ చౌధరి, రేణుక సింగ్‌ సూరత, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, స్మృతి ఇరానీ, రాందాస్‌ అథవాలే. 

క్రిమినల్‌ కేసులు: నలుగురు కేంద్రమంత్రులపై హత్యాయత్నం కేసులు నమోదుకాగా నిశిత్‌ ప్రమానిక్‌పై హత్య సంబంధిత కేసునమోదైంది. 

మతఘర్షణల కేసులు..
ఐదుగురు మంత్రులపై మత ఘర్షణల కేసులు నమోదు అయ్యాయి. మతం, జాతి, మతం, మత విశ్వాసాలను అవమానించడం ద్వారా మతపరమైన ఘర్షణలకు ఉద్దేశ పూర్వక చర్యలకు పాల్పడడం (ఐపీసీ సెక్షన్‌ 295ఏ)  

రూ.10 కోట్లపైనే అప్పులు 
16 మందిమంత్రులకు రూ.కోటికన్నా ఎక్కువ అప్పులు ఉండగా వీరిలో ముగ్గురుకి రూ.10 కోట్లకన్నా పైనే అప్పులున్నాయని వారి వారి అఫిడవిట్లు చెబుతున్నాయనిసంస్థ పేర్కొంది.   

రూ.కోటి కన్నా తక్కువే
ఎనిమిది మంది మంత్రు ల ఆస్తి రూ.కోటికన్నా తక్కువేనని వారి అఫిడవిట్లు చెబుతున్నా యని సంస్థ పేర్కొంది.    

ధన ‘మంత్రులు’ 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌