amp pages | Sakshi

కేయూపై ఆదాయ పన్ను శాఖ కొరడా

Published on Sun, 02/26/2023 - 10:10

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీపై ఆదాయ పన్నుశాఖ కొరడా ఝుళిపించింది. పలుసార్లు డిమాండ్‌ నోటీసులు ఇచ్చినా యూనివర్సిటీ అఽధికారులు (2016–2017, 2017–2018, 2018–2019 అంచనా సంవత్సరాలు) ఆదాయ వ్యయాలను ఆడిట్‌ రిటర్స్‌ దాఖలు చేయలేదు. దీంతో రూ.200 కోట్లకు డిమాండ్‌ నోటీస్‌ ఇచ్చిన ఆదాయపన్నుశాఖ, అందులో 20శాతం చొప్పున రూ.40కోట్లు ట్యాక్స్‌ చెల్లించాలని, లేనిపక్షంలో యూనివర్సిటీ అకౌంట్స్‌ సీజ్‌ చేస్తామని ఇటీవల హెచ్చరిస్తూ డిమాండ్‌ నోటీసును కూడా జారీ చేసినట్లు సమాచారం. దీంతో యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్‌, రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రావులు హైదరాబాద్‌కు వెళ్లి ఆదాయపన్నుశాఖ అధికారులను కలిసినట్లు తెలిసింది. యూనివర్సిటీకి ఆదాయ పన్నునుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అందుకు ఆ శాఖ అధికారులు నిరాకరించారని, డిమాండ్‌ నోటీస్‌ ఇచ్చినట్లుగా అందులో కొంత మొత్తం చెల్లించాల్సిందేనని చెప్పినట్లు సమాచారం. ఆ తరువాత స్టే కోరుతూ ఒక విజ్ఞాపనను రాష్ట్ర ఆదాయపన్నుశాఖకు యూనివర్సిటీ అధికారులు సమర్పించారు. దీంతో ఈ నెల 23న స్టేను మంజూరు చేస్తూనే మార్చి 7వ తేదీ లోపు రూ.25 కోట్లు (12.5శాతం)టాక్స్‌ చెల్లించాలని రెండో డిమాండ్‌ నోటీస్‌ ఇచ్చారు. రూ.25కోట్లు పన్నును చెల్లిస్తేనే సెప్టెంబర్‌ 30 వరకు స్టే కొనసాగింపు వర్తిస్తుంది.
ఫీజు మీరే చెల్లించుకోండి : వీసీ
కాకతీయ యూనివర్సిటీలోని వివిధ కార్యాలయాలు విభాగాల్లో, కళాశాలల్లోని ప్రిన్సిపాల్స్‌, డ్రాయింగ్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లతో గత శుక్రవారం సెనేట్‌హాల్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. మీ పరిధిలోని ఆదాయవ్యయాలను, ఖాతాలను చార్టడ్‌ అకౌంటెంట్‌ ద్వారా ఆడిట్‌ చేయిచుకోవాలని 28 వరకు పూర్తిచేసుకోవాలని ఆదేశించారు. పారదర్శకంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

తొలుత రూ.25 కోట్లు చెల్లించాలని అల్టిమేటం

మార్చి 7వ తేదీ వరకు డెడ్‌లైన్‌

వర్సిటీ వీసీ నిర్లక్ష్యం వల్లేనని చర్చ

#

Tags

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)