amp pages | Sakshi

మళ్లీ లైగర్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందా?

Published on Mon, 01/03/2022 - 14:12

టాలీవుడ్లో మాస్ ఇమేజ్ కోరుకునే హీరోలెవరైనా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేసినా, తమ ముచ్చట తీరుతుందని భావిస్తారు. ఇక ఆల్రెడీ మాస్ ఇమేజ్ ఉన్నవాళ్లు పూరి సినిమాలో చేస్తే ఆ ఇమేజ్ మరింత పెరగడం ఖాయమనే విషయం కొంతమంది హీరోల విషయంలో నిజమైంది. అదే విషయాన్ని 'లైగర్' ఇప్పుడు మరోసారి నిరూపించబోతోంది. పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో లైగర్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్టుపై ఉండటం వలన ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట.

పూరి టేకింగ్‌పై విజయ్‌కి అవగాహన పెరిగితే, విజయ్‌లో తాను చూపించవలసిన మాస్ హీరోయిజం మరింత ఉందని పూరి భావిస్తున్నాడట. అందువలన ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. 'లైగర్'ను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాత శివ నిర్వాణ సినిమాను పూర్తి చేసి, మళ్లీ పూరితో కలిసి విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్ట్‌తో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే పూరి, విజయ్‌లు స్పందించే వరకు వేచి చూడాలి. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)