amp pages | Sakshi

నయన్‌ వద్దంటున్నా వినని విఘ్నేశ్‌ శివన్‌, వీడియో వైరల్‌

Published on Tue, 05/24/2022 - 17:21

సినీ స్టార్స్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లకు ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఈ మధ్య గుళ్లూ గోపురాలు చుట్టేస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. జూన్‌ 9న తిరుపతిలో వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏడడుగులు నడవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే తిరుపతి, షిరిడీ పర్యటనకు వెళ్లి ఇప్పుడు తమిళనాడు, కేరళలోని దేవాలయాలను సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వారి మధ్య ఉన్న ఆప్యాయతను తెలియజేస్తూ విఘ్నేశ్‌ శివన్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశాడు.

టేబుల్‌ మీద ఎన్నో రకాల ఐటంస్‌ ఉన్నాయి. అందులో ఒకటి ట్రై చేయమని విఘ్నేశ్‌ అడగ్గా నయన్‌ నో అంటూ తలూపింది. అయినా సరే అతడు మాత్రం భుజం మీద చేయి వేసి బుజ్జగిస్తూ ఆమెకు గోరుముద్దలు తినిపించాడు. ఆ తర్వాత అతడు తిన్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ 'సరిగ్గా తినాల్సిన సమయం ఇదే.. స్థానికంగా దొరికే రుచికరమైన ఆహారాన్ని తనకు తినిపించడంలోనే అసలైన సంతోషం ఉంది. అద్భుతమైన మనుషుల మధ్య రుచికరమైన ఫుడ్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తున్నాము' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌ ఈ ప్రేమజంట లవ్‌కు ఫిదా అవుతుంటే కొద్దిమంది మాత్రం మా సింగిల్స్‌ ఏమైపోవాలి అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి 👇
సిస్టర్‌ క్యారెక్టర్స్‌లో స్టార్‌ హీరోయిన్స్‌..
11 నెలలుగా నా ఇంట్లో నా భార్యతో ఉంటున్నాడు: నటుడు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌