amp pages | Sakshi

సీతతో రిలేషన్‌పై ప్రభాస్‌ను ప్రశ్నించిన బాలయ్య

Published on Wed, 12/28/2022 - 18:19

పాన్‌ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ కలిస్తే ఎలా ఉంటుంది. ఆ జోష్‌ వేరే లెవల్‌ కదా! బాలయ్య హోస్ట్ చేస్తోన్న‌ పాపుల‌ర్ టాక్ షో అన్‌స్టాప‌బుల్‌లో ప్రభాస్‌ పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లైంది. ఇందులో డార్లింగ్‌ సైలెంట్‌గా కాకుండా జోకులేస్తూ నవ్విస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఇటు నంద‌మూరి బాల‌కృష్ణ అటు ప్ర‌భాస్‌, గోపీచంద్‌ల ఫ్యాన్స్‌కు ప‌ర్‌ఫెక్ట్ విందు భోజ‌నంలాంటి ఎపిసోడ్‌ను సిద్ధం చేసింది ఆహా. అయితే ఆ ఎపిసోడ్‌ను ఎడిట్‌ చేయడానికి మాత్రం చాలా కష్టపడుతోందట. 

ఎందుకంటే ఇందులో ప్ర‌తి క్ష‌ణం ఎంతో విలువైన‌దే. దాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆస్వాదించాల్సిందేనంటోంది. దీంతో ఆహా ఈ బాహుబ‌లి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించుకుంది. బాహుబలి - 1 ది బిగినింగ్ ఎపిసోడ్‌ను డిసెంబ‌ర్ 30న, బాహుబలి క‌న్‌క్లూజ‌న్ ఎపిసోడ్‌ను  జ‌న‌వ‌రి 6న ప్రసారం చేయనుంది. అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే చరిత్రలో ఓ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా అందించ‌టం ఇదే మొద‌టిసారి. తొలి ఎపిసోడ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. రెండో ఎపిసోడ్‌లో ప్ర‌భాస్‌, గోపీచంద్ కెరీర్ ఇండ‌స్ట్రీలో ఎలా ప్రారంభ‌మైంది. వారి స్నేహం ఎలా ప్రారంభ‌మైంది. ఇన్నేళ్ల‌లో ఎలా బ‌ల‌ప‌డింది అనే విష‌యాలుంటాయి.

‘‘మాకు అభిమానుల నుంచి లెక్కలేనన్ని మెసేజెస్ వచ్చాయి. ఈ  ఎపిసోడ్‌ను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రసారం చేయాల‌ని కోరారు. దీంతో ప్ర‌భాస్‌, నంద‌మూరి బాల‌కృష్ణ, ఆహా టీమ్ అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకున్న త‌ర్వాత రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్‌ను అందించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. న్యూ ఇయ‌ర్‌ను నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ కాంబినేష‌న్‌తో ఆహాలో రాబోతున్న ఈ టాక్ షో ఎపిసోడ్ కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌టానికి ఏముంటుంది. ఎవ‌రూ ఊహించ‌లేని కొత్త విష‌యాలు, అంత‌కు మించిన ఫ‌న్ డిసెంబ‌ర్ 30, జ‌న‌వ‌రి 6న ఆహా ద్వారా స్క్రీన్స్‌ను ఢీ కొట్ట‌నుంది’’ అని ఆహా టీమ్ తెలియజేసింది. ఇకపోతే తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ‌.. ప్ర‌భాస్‌ను సీత‌తో ఉన్న రిలేష‌న్ గురించి ప్ర‌శ్నించారు. దానికి ఆయ‌న ఏమ‌ని బ‌దులిచ్చారో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే!

చదవండి: మీ ఇంటికొచ్చి తరిమి తరిమి కొడతా: సోహైల్‌ వార్నింగ్‌
చెప్పులు కూడా వదిలేసి పారిపోయిన హీరోయిన్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)