amp pages | Sakshi

సునీత నా పెద్ద కొడుకు: సింగర్‌ తండ్రి ఎమోషనల్‌

Published on Sun, 01/09/2022 - 13:58

‘ప్రతి పెళ్లికి ఓ స్టోరీ ఉంటుంది. అది ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది ’అంటుంది సింగర్‌ సునీత. తన పాటలతో లక్షలాది మంది అభిమానులను సంపాందించుకున్న సునీత గతేడాదిలో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021, జనవరి 9న ప్రముఖవ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సునీత వివాహం జరిగింది. నేడు(జనవరి 9) వారి తొలి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ‘వెడ్డింగ్‌ మెమోరీస్‌’అంటూ వివాహ వేడుక జ్ఞాపకాలు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది సునీత.

అందులో తమ గురించి, తమ వివాహం గురించి ఇరు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ఉన్నాయి. సునీత గురించి ఆమె తల్లి మాట్లాడుతూ..‘బరువు, బాధ్యతలన్నీ తీర్చుకుంటూ.. ఎప్పుడూ చిరునవ్వుతో.. అన్ని సహనంతో చేసుకుంటూ ముందడుగు వేసింది. డేరింగ్‌ అండ్‌ డైనమిక్‌ పర్సనాలిటీ తనది’అని చెప్పుకొచ్చింది.

అలాగే రామ్‌పై సునీతకు ఉన్న ఒపీనియన్‌ ఏంటో కూడా ఆ వీడియో ఉంది. ‘రామ్‌ తనుకు ఎనిమిదేళ్లుగా తెలుసు, చాలా నీజాయితీపరుడు, ఏదైనా ముఖంపైనే చెప్పే వ్యక్తిత్వం తనది. అతను మంచి కాఫీ లాంటి అబ్బాయ్‌’ అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది సునీత .

‘సునీత జీవితంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొంది.ఇప్పటికీ మా కుటుంబానికి పెద్ద కొడుకులాగానే ఉంటుంది​’అని సునీత తండ్రి అన్నారు. 

పెళ్లి తర్వాత తన జీవితం చాలా బ్యూటీఫుల్‌గా సాగుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సునీత ‘వెడ్డింగ్‌ మెమోరీస్‌’నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌