రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
హీరోయిన్ గురించి ఫేక్ న్యూస్.. స్పందించిన మేనేజర్
Published on Fri, 02/04/2022 - 15:01
Shalini Ajith Kumar Is Not On Twitter: స్టార్ హీరో అజిత్ భార్య, హీరోయిన్ షాలిని పేరుతో ఓ ట్విట్టర్ అకౌంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది రియల్ అకౌంట్ కాదు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు షాలిని పేరుతో ఫేక్ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. మిస్సెస్ షాలిని అజిత్‌కుమార్ పేరుతో క్రియేట్ అయిన ఈ ట్విట్టర్ అకౌంట్‌ను అప్పటికే కొందరు అభిమానులు ఫాలో అయ్యారు.
విషయం తెలుసుకున్న అజిత్‌కుమార్ కార్యాలయం సిబ్బంది వెంటనే దీన్ని గుర్తించి ఇది ఫేక్ అకౌంట్ అని తేల్చేశారు. షాలినికి సోషల్ మీడియాలో ఎటువంటి ఖాతా లేదని అజిత్‌కుమార్ వ్యక్తిగత పీఆర్వో స్పష్టం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక హీరో అజిత్‌కుమార్ సైతం తనకు సోషల్ మీడియాలో అకౌంట్స్ లేవని ఇటీవలె పేర్కొన్న సంగతి తెలిసిందే.
There is a fake twitter account in the name of #MrsShaliniAjithkumar and we would like to clarify that she is not in twitter. Kindly ignore the same .
— Suresh Chandra (@SureshChandraa) February 2, 2022
Tags