amp pages | Sakshi

విడాకులపై స్పందించిన సమంత తండ్రి

Published on Tue, 10/05/2021 - 17:27

Samantha Father Comments On ChaySam Divorce: తన కూతురి విడాకులపై సమంత తండ్రి జోసెఫ్‌ ప్రభు స్పందించారు. సమంత-నాగ చైతన్య విడాకుల విషయం తెలియగానే తన మైండ్‌ బ్లాక్‌ అయ్యందంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చై-సామ్‌ విడాకుల విషయం వినగానే మొదట తనకు ఏం అర్థం కాలేదని, కళ్ల ముందు అంతా చీకటి కమ్ముకుందని ఆయన పేర్కొన్నారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని సమంతకు చెప్పినట్లు తెలిపారు. అయితే తన కూతురు స్పృహ ఉండే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని, త్వరలోనే అన్ని పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నానని సామ్‌ తండ్రి పేర్కొన్నారు. కాగా చై-సామ్‌ విడాకులు ప్రకటించిన అనంతరం అక్కినేని హీరో, చైతన్య తండ్రి నాగార్జున కూడా స్పందించిన సంగతి తెలిసిందే. 

చదవండి: నాగ చైతన్య-సమంతలకు అభిమానుల విజ్ఞప్తి

చైతూ-సమంత విడిపోవడం దురదృష్టకరమంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. చైతూ-సమంత విడిపోవటం దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు మాకు ఆత్మీయులే. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’అని రాసుకొచ్చాడు. అంతేగాక సమంత ఫ్యామిలీ ఎల్లప్పుడూ తమకు ఆత్మీయులేనని, చైతు-సమంత ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని నాగార్జున పేర్కొన్నారు. కాగా తామిద్దరం విడిపోతున్నామని, ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామంటూ నాగ చైతన్య-సమంత శనివారం(అక్టోబర్‌ 2) సోషల్‌ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: సమంత కట్టుకున్న పెళ్లి చీర ఎవరిదో తెలుసా?

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)