amp pages | Sakshi

Tamannaah Bhatia Birthday Special: హ్యాపీ బర్త్‌డే మిల్కీ బ్యూటీ

Published on Tue, 12/21/2021 - 15:11

సాక్షి, హైదరాబాద్‌: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు అయినా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న స్టార్‌ హీరోయిన్‌ మిల్కీ బ్యూటీ తమన్నా. హిట్‌ అయినా... ఫట్అయినా 100% లవ్‌తో తన స్టయిల్‌లో టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. హ్యాపీడేస్‌ మూవీతో విజయాన్ని అందుకోవడమే కాదు..లంగావోణీలో కుర్రకారు గుండెల్లో సెటిల్‌ అయిపోయింది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న సినిమాల్లోనూ తన సత్తాను చాటుకుంటోంది. ఇపుడిక ట్రెండ్‌కు తగ్గట్టు స్పెషల్‌ సాంగ్స్‌తో  దుమ్ము  రేపుతున్న తమ్మూకి హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి.

సంతోష్ భాటియా, రజనీ దంపతులకు 1989 డిసెంబర్‌ 21న  ముంబైలె జన్మించింది తమన్నా ఆమె తండ్రి డైమండ్‌ వ్యాపారవేత్త. తమన్నాకు ఆనంద్‌ అనే అన్నయ్య కూడా ఉన్నారు.  15 ఏళ్లకే  ‘చాంద్‌ సా రోషన్ చెహ్రా’ అనే బాలీవుడ్‌ చిత్రంతో 2005లో కథానాయికగా బిగ్‌స్ర్కీన్‌పై  ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్‌  ప్రేక్షకులను పలకరించింది. 2006లో విడుదలైన ‘కేడీ’తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి  తనదైన నటనతో ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఆసక్తి  ఉన్న  తమన్నా స్పెప్పులతో ఇరగదీస్తుంది. ముఖ్యంగా  ‘జై లవకుశ’లోని ‘స్వింగ్‌ జరా’, ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో డాంగ్‌  డాంగ్‌ లాంటి స్పెషల్‌ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌నుఫిదా చేసింది.   టాలీవుడ్‌ సెన్సేషనల్‌ మూవీ బాహుబలిలో అవంతిక పాత్రతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది.

వరుస పరాజయాలు వెక్కిరించినా.. ఒటమి ఎదురైన చోటే విజయాన్ని దక్కించుకున్న హీరోయిన్‌ తమన్నా. అలా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్‌’ మూవీతో  భారీ  హిట్‌ అందుకుంది. ఇక ఆ తరువాత  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్‌ క్యూ కట్టాయి. టాలీవుడ్‌ అగ్రహీరోల అందరి సరసన చాన్స్‌ కొట్టేసింది.  నాగార్జున, రాం చరణ్ తేజ, రామ్, ప్రభాస్ , పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదితర నటులతో నటించింది. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘100% లవ్‌’, ‘బద్రినాథ్‌’, ‘ఊసరవెల్లి’, ‘రచ్చ’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, తడాఖా, ‘బాహుబలి’, ‘ఊపిరి’, ‘ఎఫ్‌2’ ‘సైరా’ లాంటి మూవీల్లో తమన్నా అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  

ఇటీవలే గోపీచంద్ హీరోగా నటించిన సీటీమార్ సినిమాతో హిట్ అందుకుంది తమన్నా. అలాగే యంగ్ హీరో సత్య దేవ్ నటిస్తున్న గుర్తుందా శీతాకాలం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాదు ఓటీటీలో కూడా తమన్నా విజయాన్ని అందుకుంది. తమన్నా లీడ్‌ రోల్‌లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రదీప్ ఉప్పలపాటి  నిర్మించిన ఎమోష‌న‌ల్ థ్రిల్లింగ్  తెలుగు వెబ్ సిరీస్ లెవ‌న్త్ అవ‌ర్‌`కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది అయితే హిమ్మత్‍వాలా బాలీవుడ్‌లో పెద్దగా సక్సెస్‌ కాలేకపోయినా మరెన్నో హిందీ సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకుంది. 

అన్నట్టు తమన్నా  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన ఫిట్‌నెస్‌ విశేషాలతోపాటు, సినీ సంగతులతో ఫ్యాన్స్‌కు అప్‌ టూ డేట్‌గా ఉంటుందీ  బ్యూటీ.  ట్రెండీ, సెక్సీ ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. యోగా, జిమ్‌ ఫోటోలను, ఆ మధ్య తమన్నాకు కరోనా సోకినపుడు కూడా ఫ్యాన్స్‌ తో నిరంతరం టచ్‌లో ఉండటంఆమెకు అలవాటు. తాజాగా తమన్నా పోస్ట్ చేసిన ఎఫ్ 3 చిత్రంలో అమ్మవారి గెటప్ లో తమన్నా ఫోటోలు హల్‌చల్‌ చేశాయి. విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తమన్నా.. మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానుంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)