amp pages | Sakshi

ఆలియా వేసుకున్న డ్రెస్‌ ధర సుమారు లక్షల్లోనే!

Published on Sun, 02/06/2022 - 09:10

బాలీవుడ్​ క్యూట్​ బ్యూటీ, ఆర్​ఆర్​ఆర్​ సీత అలియా భట్​ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ఇటీవల రిలీజ్​ చేసిన ఈ సినిమా ట్రైలర్​లో అలియా యాక్టింగ్​కు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఆలియా భట్‌.. పేరునే పరిచయంగా, ప్రతిభనే ఉనికిగా మార్చుకున్న నటి. ఫ్యాషన్‌లోనూ అంతే ప్రత్యేకతను చాటుతోంది... ఈ బ్రాండ్స్‌తో!



మాధుర్య క్రియేషన్స్‌...
పేరుకు తగ్గట్టే చక్కటి ఆభరణాలను డిజైన్‌ చేస్తుందీ సంస్థ. బెంగళూరుకు చెందిన భానుమతి నరసింహన్‌ స్థాపించిన  ‘గిఫ్ట్‌ ఎ చైల్డ్‌’ స్వచ్ఛంద సంస్థ కోసం ఈ మాధుర్య క్రియేషన్స్‌ పనిచేస్తుంది. 2007లో ప్రారంభించిన ఈ సంస్థ, మొదట కేవలం ఆభరణాలనే అందించే వారు. ప్రస్తుతం ఆభరణాలతో పాటు ట్రెడిషనల్‌ డిజైన్స్‌లో చీరలు, గృహ అలంకరణ సామాగ్రి కూడా ఇక్కడ లభిస్తున్నాయి. ఎక్కువగా హస్తకళలకు ప్రాధాన్యం ఇస్తారు. పేరుకు దేశీ బ్రాండ్‌ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. 



పాయల్‌ ఖండ్‌వాలా.. 
టాప్‌ మోస్ట్‌ లగ్జూరియస్‌ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో పాయల్‌ ఖండ్‌వాలా ఒకటి. సంప్రదాయ అల్లికలు, కుందన్‌ వర్క్స్‌తో లభించే ఈ డిజైన్స్‌కు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. 2012లో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ పాయల్‌ తన పేరు మీదే ‘పాయల్‌ ఖండ్‌వాలా’ పేరుతో మొదలుపెట్టిన ఈ ఫ్యాషన్‌ బ్రాండ్‌ అంటే ప్రతి ఒక్కరికీ క్రేజే. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. సందర్భానికి తగ్గట్టు స్పెషల్‌గా దుస్తులను డిజైన్‌ చేయించుకునే వీలు కూడా ఉంటుందిక్కడ. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. 

పాయల్​ ఖండ్​వాలా బ్రాండ్ డ్రెస్​ ధరలు

కుర్తా- రూ. 47,500
పలాజో- రూ. 64,500
దుపట్టా- రూ. 17,500
మాధురి క్రియేషన్స్​ బ్రాండ్​ జ్యూయెలరీ ధర- రూ. 9,400

'చాలామంది ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రింజ్‌ ట్రెండ్‌ అంటే ఇష్టపడతారు  కానీ, నాకెందుకో ఆ స్టయిల్‌ డిజైన్స్‌ పెద్దగా నచ్చవు. అది తప్ప మిగితా ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ అన్నింటినీ నేను ఫాలో అవుతా.' అని అలియా తెలిపింది. 

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)