amp pages | Sakshi

RC 15: శంకర్‌ మూవీ కోసం చెర్రీ భారీ రెమ్యునరేషన్‌, ఎంతంటే..?

Published on Tue, 10/12/2021 - 20:53

సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ మూవీ టేకింగ్‌ గురించి అందరికి తెలిసిందే. సినిమా ఏదైనా భారీతనం ఉట్టిపడాల్సిందే. తాజాగా రామ్‌ చరణ్‌ సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కించబోతున్నాడట. దిల్‌ రాజు బ్యానర్‌లో రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ పూజా కార్యక్రమం సెప్టెంబర్‌లో అట్టహాసంగా జరిగింది.  

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ కాన్సెప్ట్‌ పోస్టర్‌ కోసమే దాదాపు రూ.2 కోట‍్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం కోసం రామ్‌ చరణ్‌ భారీ రెమ్యునరేషన్‌ తీసుకోబోతున్నాడని ఈ వార్త సారాంశం. దాదాపు  200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం రామ్‌ చరణ్‌ రూ. 80 కోట్ల వరకు పారితోషకంగా అందుకోబోతున్నాడట.

ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారడంతో చెర్రీకి అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ దక్కబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  ఈ మూవీలో రామ్‌ చరణ్‌ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. శ్రీకాంత్‌, సునీల్‌ అంజలి, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)