amp pages | Sakshi

'నిక్‌ జోనాస్‌ వైఫ్‌' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్‌..

Published on Fri, 12/17/2021 - 13:46

Priyanka Chopra Get Angry For Calling Her Nick Jonas Wife: గ్లోబల్‌ స్టార్‌, బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్‌ ప్రస్తుతం తన రాబోయే హాలీవుడ్‌ చిత్రం 'ది మ్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్‌' ప్రమోషన్‌లో బిజీగా ఉంది. తాజాగా ప్రియాంక ఓ వార్తా కథనంపై విరుచుకుపడింది. ఇంకా అలా ఏన్నాళ్లు రాస్తారు అని మండిపడింది. మహిళలకు ఇంకా ఇలా ఎందుకు జరుగుతుందో అని అసహనం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల ఒక వెబ్‌సైట్‌ తన వార్తా కథనంలో ప్రియాంక చోప్రాను నిక్‌ జోనాస్‌ భార్యగా ప్రస్తావించడం (గుర్తింపు ఇవ్వడం) ప్రియాంక కోపానికి కారణమైంది. అలా రాసిన వార్తా కథనాన్ని తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. 

'మోస్ట్‌ ఐకానిక్‌ ఫిల్మ్‌ ఫ్రాంచైజీకి చెందిన 'ది మ్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్‌' చిత్రాన్ని నేను ప్రమోట్‌ చేస్తుంటే.. ఇప్పటికీ నేను 'ది వైఫ్‌ ఆఫ్‌..'గా సూచించబడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో దయచేసి వివరణ ఇవ్వమని కోరింది. నేను నా ఐఎండీబీ (IMDB) లింక్‌ని నా బయోకు జోడించాలా ?' అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. దీనికి ప్రియాంక భర్త నిక్‌ జోనాస్‌ను కూడా ట్యాగ్‌ చేసింది. ప్రియాంక తన రాబోయే ప్రాజెక్ట్‌ సిటాడెల్‌ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. తాను నటించిన 'ది మ‍్యాట్రిక్స్‌' ఫ్రాంచైజీలోని మూడో చిత్రం 'ది మ్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రియాంక అధికారికంగా ప్రారంభించింది. 

'మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్‌' సినిమాలో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్, నీల్ పాట్రిక్ హారిస్, యాహ్యా అబ్దుల్-మతీన్ 2, జోనాథన్ గ్రోఫ్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక 'సిటాడెల్‌' సినిమాతోపాటు ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ఒక బాలీవుడ్‌ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి 'జీ లే జరా' అని  పేరు పెట్టారు. ఇందులో కత్రీనా కైఫ్‌, అలియా భట్‌తో స్క‍్రీన్‌ షేర్‌ చేసుకోనుంది ప్రియాంక జోనాస్. 

Videos

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్

Photos

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)