అజ్ఞాతవాసి పొలిటికల్‌ సినిమా

Published on Mon, 03/04/2024 - 15:59

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్.. ఈ రెండు పేర్లు కూడా ఆయనవే. కానీ 2024 ఎన్నికలు జరగక ముందే 'పవర్ స్టార్' అవతారంలో ఫిక్సయ్యేలా కనిపిస్తున్నాడు పవన్‌. అదే అభిప్రాయం ఆయన అభిమానుల్లో కూడా కలుగుతోంది. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే వాళ్లు సినిమాలు వదులుకోలేరు. రాజకీయాలను.. ముఖ్యంగా అధికారాన్ని చెలాయించాలనుకుంటారు. రెండూ కావాలని వస్తే ప్రజలు ఊరుకోరు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను రెండు చోట్ల ప్రజలు ఓడగొట్టారు. 

(ఇదీ చదవండి: లగేజీ ప్యాక్‌ చేసుకున్న మెగా బ్రదర్స్‌.. పరుగులు పెడుతున్న పవన్‌)

పవన్‌ కళ్యాణ్‌ పార్ట్ టైమ్‌ పొలిటిషియనా? లేక సినిమాలు పార్ట్ టైమా? అనే విషయంలో పవన్‌కు ఓ క్లారిటీ ఉన్నట్టుంది. గత రెండేళ్ల కాలం చూస్తే పవన్‌ కళ్యాణ్‌ సినిమాల​కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసిపోతుంది. వారం క్రితం జెండా సభ అంటూ స్టేజీపై రెచ్చిపోయిన పవన్‌ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆ సభకు ముందు కూడా ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. కనీసం ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో పవన్‌ ఉన్నాడు. 50 రోజుల్లో ఎన్నికలు ఉండగా ఏ పార్టీ అధినేత కూడా ఇలా చేయడు. వారాహి యాత్ర అంటూ ఊదరగొట్టినా.. ఆరు నెలల నుంచి ఆ వాహనం ఎక్కడికి వెళ్లిందో తెలియదు. తెలంగాణ ఎన్నికల్లో అతి కష్టమ్మీద 8 మంది అభ్యర్థులను దించినా.. చివరాఖరి వరకు పవన్‌ ప్రచారమే చేయలేదు. షూటింగ్‌లు లేనప్పుడు మాత్రమే పవన్‌కు రాజకీయాలు గుర్తొస్తాయంటారు జనసైనికులు. 

అధికారం కోసం అల్లాడిపోయే.. పవన్‌.. రాజకీయాలకు ఎంత సమయం కేటాయిస్తున్నడన్నది బిగ్‌ క్వశ్చన్‌ మార్క్‌. గత మూడేళ్లుగా ఆయన సినిమాల లిస్టు ఒకసారి పరిశీలిద్దాం.

  • 2019 - సినిమా నెరేషన్‌ 
  • 2021 - వకీల్‌ సాబ్‌
  • 2022 - భీమ్లా నాయక్‌
  • 2023 - బ్రో
  • 2024 - ఓజీ, హరిహర వీర మల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌(?)

2024 ఎన్నికల కోసం నానా హంగామా చేస్తోన్న పవన్‌ కళ్యాణ్‌.. ఈ ఏడాది మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఓజి సినిమా కోసం ఇంకా కనీసం 30 రోజులు షూటింగ్‌ వర్క్‌ చేయాల్సి ఉంది. ఈ సినిమాకు బాగా మార్కెట్‌ కావాలని తెగ ప్రచారం చేశారు. ఇప్పటికే ఓజి సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. అనుకున్న సమయానికి రీలీజ్‌ చేయాలంటే ఎన్నికలు అయిన వెంటనే పవన్‌ రాజకీయాలను ప్యాకప్‌ చేసి సినిమాల కోసం మేకప్‌ వేసుకోవాలి. పవన్ చేతిలో హరిహరవీరమల్లు (క్రిష్‌) , ఓజీ (సుజిత్‌) , ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (హరీష్‌ శంకర్) వంటి టాప్‌  ప్రాజెక్టులున్నాయి. వీటిలో హరిహరవీరమల్లు, ఓజీ చిత్రాలు షూటింగ్‌ మధ్యలో ఉన్నాయి. రెండు నెలల క్రితం ఫుల్‌ బిజీగా ఈ సినిమాల షూటింగ్‌ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కోసం పార్ట్‌టైమ్‌ జాబ్‌ మాదిరి టీడీపీలో స్టార్‌ క్యాంపెయినర్‌గా పవన్‌ ఉన్నాడు. ఎన్నికల్లో పవన్‌ రోల్‌ ముగిసిన తర్వాత వెంటనే మళ్లీ రెగ్యూలర్‌ షూటింగ్స్‌లోకి వెళ్లడం ఖాయం.

(ఇదీ చదవండి: పవన్‌ కల్యాణ్‌ మోసం చేశారు: ట్రాన్స్‌జెండర్)

తాజాగా నిర్మాత దానయ్య కూడా పవన్‌ను కలిసిన విషయం తెలిసిందే.. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఓజి సినిమా పూర్తి చేస్తానని పవన్‌ మాట ఇచ్చారట. ఈ భారీ ప్రాజెక్ట్‌తో పాటు.. పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు మరో రెండు వున్నాయనే విషయం తెలిసిందే. ఇలా మొత్తం మూడు సినిమాలు చేయాలి.. సాధారణంగా ఒక టాప్‌ హీరోకు చెందిన సినిమా తర్వాత మరో సినిమా థియేటర్‌‌లోకి రావాలంటే సుమారు రెండేళ్లు అయినా పడుతుంది. అలాంటిది పవన్‌ ఒప్పుకున్న సినిమాలు మూడు ఉన్నాయి. అంటే ఈ లెక్కన పవన్‌ వచ్చే ఎన్నికల వరకు మళ్లీ సినిమాలతోనే బిజీగా ఉంటారు. ఉన్న ప్రాజెక్ట్‌లతోనే ఆయన బిజీగా ఉంటే మరో సినిమాను సెట్ చేయడానికి పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే భవిష్యత్‌లో సినిమాలు కొనసాగించాలనే పవన్ నిర్ణయించుకున్నారని స్పష్టంగా ఎవరికైనా అర్థం అవుతుంది.

చంద్రబాబు కోసం... తాను రాజకీయం చేస్తున్నానని పదేపదే చెబుతున్న పవన్‌.. అందుకు తగ్గట్టు తాజాగా జరిగిన జెండా సభలో కూడా బాబును ఉద్ధండుడిగా అభివర్ణించాడు. అక్కడి వరకు జనసేన కార్యకర్తలకు ఇబ్బంది లేదు కానీ.. నన్నెలా ప్రశ్నిస్తారంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే పవన్‌ విరుచుకుపడడం .. జనసైనికులను షాక్‌కు గురి చేసింది. తాను అసలు రాజకీయాలు చేస్తాడా? ఎన్నికల తర్వాత పార్టీ నడుపుతాడా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వడు. సింగిల్‌గా పోటీ చేయి, వచ్చే ఎన్నికల నాటికి నాయకుడిగా ఎదుగుతావని బీజేపీ పెద్దలు చీవాట్లు పెట్టారని తానే స్వయంగా చెప్పుకున్నాడు. అంత హితబోధ చేసినా.. పవన్‌ మాత్రం జై బాబు మత్తులోనే ఉన్నాడు. మరి రాజకీయాలైనా సీరియస్‌గా చేస్తాడా.. అదీ లేదు. ఏదేమైనా 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి ఓడిపోతుందని పవన్‌, ఆయన దత్తతండ్రికి ముందే తెలుసంటున్నారు. అన్ని లెక్కలు పవన్‌ వద్ద ఉన్నాయి కాబట్టే సినిమాలు వదులుకోకుండా వచ్చే ఐదేళ్ల వరకు పలు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టాడు. తాను ఇక సినిమాల్లో నటించనని ఒకప్పుడు పవన్ అన్నాడు. కానీ ఆ మాట అన్న తరువాతే ఆయన నటించడం ఎక్కువైంది అన్నది ఫిలింనగర్‌లో పిల్లాడిని అడిగినా చెబుతాడు. పవన్‌ పొలిటికల్‌ సినిమాకు అప్పటివరకు భశుం.

(ఇదీ చదవండి: పవన్‌ కల్యాణ్‌ వీక్‌నెస్‌ ఏంటో గానీ.. మరీ ఇంత దిగజారుడా..!?)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ