amp pages | Sakshi

పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ బిరుదును ఇచ్చింది ఎవరో తెలుసా..?

Published on Thu, 09/02/2021 - 01:15

తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్‌ అనతి కాలంలోనే అన్నకు తగ్గ తమ్ముడిగా గుర్తింపు పొందారు. ఇదే క్రమంలో అన్నయ్య చిరంజీవి బాటలోనే పవన్ కళ్యాణ్‌ తక్కువ కాలంలోనే పవర్‌ స్టార్‌గా ఎదిగారు. అయితే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు పొందడం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఆ వివరాల్లోకి వెళితే.. సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. అప్పట్లో పవన్ కల్యాణ్ తన చిన్న అన్నయ్య నాగబాబుతో కలిసి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.


ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇ.వి.వి.సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఆ సినిమా ఏవరేజ్‌గా నిలిచింది. ఆ సినిమా తదుపరి పవన్ కళ్యాణ్, చిరంజీవికి హిట్లర్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ సినిమా చేశారు. ఈ చిత్రం తమిళంలో హిట్టైన ‘గోకులతై సీతై’ సినిమాకు రీమేక్.  ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

‘గోకులంలో సీత’ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా పోసాని తొలిసారిగా విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను పవర్ స్టార్ అని సంబోధించారు. ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు కూడా రాశాయి. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాకి తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్  వేశారు.


అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్‌ పవర్ స్టార్‌గా బిరుదు పొందడం వెనుక పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు పోసాని కూడా ప్రస్తావించారు. ఇక సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్‌ 50వ జన్మదినం కావడంతో తన సినిమాలకి సంబందించిన తాజా అప్‌డేట్లతో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్‌ డైరెక్షన్‌లో ‘హరి హర వీరమల్లు’తో పాటు హరీష్ శంకర్ సినిమాలతో తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)