amp pages | Sakshi

ఇండస్ట్రీలో టాలెంట్‌ ఉంటే సరిపోదు..: ‘ఇస్మార్ట్‌’ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Fri, 10/14/2022 - 18:06

నాగ చైతన్య ‘సవ్యసాచి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిధి అగర్వాల్‌. ఆ తర్వాత రామ్‌ సరసన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో నటించి తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. మరోవైపు తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్‌గా పుల్‌ బిజీ అయిపోయింది.  ఈ క్రమంలో తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె ఇండస్ట్రీపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

చదవండి: లైగర్‌ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే

ఈ సందర్భంగా నిధి పరిశ్రమలో హీరోయిన్లను కేవలం గ్లామర్‌ షో కోసమే అన్నట్టు చూస్తారంటూ ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. అందం కూడా ఉండాలి. కేవలం టాలెంట్‌ చూసి అవకాశాలు ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు హీరోయిన్‌ అందంగా ఉందా? లేదా? అనేదే చూస్తారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హీరోయిన్‌ పని గ్లామర్‌ షో చేయడమే.

చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

ప్రేక్షకులు చూసేది కూడా అదే. అందుకే నేను గ్లామర్‌ షో చేసేందుకు వెనుకాడను. డైరెక్టర్లు అడిగితే కాదని కూడా చెప్పను. ఇక పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం వస్తే అసలు వదులుకోను. అలాగే రెమ్యూనరేషన్‌ విషయంలో కూడా ఎలాంటి డిమాండ్‌ చేయను. వాళ్లు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. కాకపోతే నా మినిమం పారితోషికం ఇంత అని మాత్రం చెప్తాను. ఎందుకంటే పెద్ద హీరోతో సినిమా చేస్తే ఆ తర్వాత అవకాశాలు తప్పకుండా వస్తాయని నేను నమ్ముతాను’ అని అంటూ నిధి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌