amp pages | Sakshi

భాగ్యనగరంలో సన్‌ ఆఫ్‌ ఇండియా

Published on Thu, 11/26/2020 - 00:10

మంచు మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న దేశభక్తి కథా చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. ఈ చిత్రానికి ‘డైమండ్‌’ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ‘‘ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్‌ఫుల్‌ పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నారు. ఈ తరహా కథ కానీ, ఈ జానర్‌ సినిమా కానీ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు.

ఇటీవల తిరుపతి షెడ్యూల్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించాం. హైదరాబాద్‌ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై అధిక భాగం సన్నివేశాలను చిత్రీకరిస్తాం. మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూర్చిన ఈ సినిమాకు ‘డైమండ్‌’ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్‌ సంభాషణలు రాశారు. మోహన్‌బాబుకు స్టయిలిస్ట్‌గా ఆయన కోడలు విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌ మురారి, సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ, ఎడిటింగ్‌:  గౌతంరాజు, ఆర్ట్‌: చిన్నా.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)