amp pages | Sakshi

'మా' ఎన్నికలపై ట్విట్టర్ రగడ.. ప్రకాశ్‌రాజ్‌కు నరేష్‌ ఘాటు రిప్లై

Published on Thu, 07/08/2021 - 09:51

టాలీవుడ్‌లో ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా..3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో ఎన్నడూ లేనంతగా ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికలపై సోషల్‌ మీడియాలోనూ వాడీ-వేడి చర్చలు జరుగుతున్నాయి. గతంలో కంటే ఈసారి 'మా' ఎన్నికలు రంజుగా సాగనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమలతో పాటు సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ఇప్పుడు మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది.

ఇక అందరికంటే ముందే ప్రకాశ్‌రాజ్‌ వ్యూహ రచనతో ముందుకెళ్తున్నారు. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే సినీ పెద్దల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుండటం, సడెన్‌గా నాన్‌ లోకల్‌ ఇష్యూ తెరపైకి రావడం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు మురళీమోహన్‌ మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి మా ఎన్నికలు ఉండవని.. ఏకగ్రీవమే జరుగుతుందని బాంబు పేల్చారు. దీంతో అసలు పోటీ ఉంటుందా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ ఎప్పుడు ? #Justasking అంటూ ప్రకాష్ రాజ్‌ చేసిన ట్వీట్‌ మాలో మరోసారి హీట్‌ పెంచేశాయి. ఇందుకు బదులుగా ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌ కౌంటర్‌ రిప్లై ఇచ్చారు. 'జనరల్ బాడీ మీటింగ్‌లో ఎన్నికలపై ఒక తీర్మానం చేద్దామనుకున్నాం. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా జనరల్ బాడీ మీటిగ్ జరగలేదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మా ఎన్నికలు సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని ఇది వరకే చెప్పాం. మెయిల్‌ కూడా పంపించాం. ఇప్పుడు మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇది నీళ్లు నింపకుండానే  స్విమ్మింగ్ పూల్‌లో దూకుతాను అన్నట్టుగా ఉంది. మా నిర్ణయం వచ్చేవరకు వెయిట్ చేయండి సార్‌' అంటూ నరేష్‌ ఘాటు రిప్లై ఇచ్చారు. ఈ విషయంపై ఏప్రిల్ 12న ఇదివరకే  ప్రకాష్‌రాజ్‌కి పంపిన లేఖను కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి  ట్వీట్స్‌  నెట్టింట వైరల్‌గా మారాయి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)