రెండో పెళ్లి చేసుకున్నా.. మొదటి భర్త కూడా 12 ఏళ్లు నాతోపాటే..

Published on Wed, 02/08/2023 - 15:43

'అంబల అంజులం' అనే తమిళ సినిమాతో మూడేళ్లకే బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నటి కుట్టి పద్మిని. కుళంద్యం దైవమమ్‌ అనే సినిమాకు గానూ ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు అందుకుంది. తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ రాణించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన ఆమె వైష్ణవి ఫిలింస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ అనే బ్యానర్‌ ద్వారా సీరియల్స్‌ రూపొందిస్తూ నిర్మాతగా మారింది. తెలుగులో లేత మనసులు, చిక్కడు దొరకడు, విచిత్ర కుటుంబం వంటి పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

'23 ఏళ్ల వయసులోనే ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మందుకు బానిసవడంతో అతడితో విడిపోయాను. 10 ఏళ్ల తర్వాత ప్రభు అనే వ్యక్తితో మరోసారి ప్రేమలో పడ్డాను. మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. కానీ కొంతకాలానికి నా మొదటి భర్తకు పూట గడవడం కూడా కష్టంగా ఉందని నా కూతురు ద్వారా తెలిసింది. ఆయనతో మళ్లీ బెడ్‌ షేర్‌ చేసుకోలేను కానీ తననలా వదిలేయాలన్పించలేదు. మా ఆఫీస్‌ కింద ఆయనకంటూ ఒక రూమ్‌ కట్టించాను. ఆఫీస్‌లో రూ.30,000 జీతానికి పని కల్పించాను. 12 ఏళ్లు అతడిని నాతో పాటే ఉంచుకున్నాను. ఒక ఫ్రెండ్‌లా మాతోనే ఉన్నారు, గతేడాది చనిపోయారు. రెండో భర్త ప్రభు నా సెక్రటరీతో లవ్‌లో పడ్డాడు. అతడికి నేను అడ్డుచెప్పలేదు. నేనిప్పుడు ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది పద్మిని.

చదవండి: నా సెక్రటరీతో భర్త ఎఫైర్‌: నటి కుట్టి పద్మిని

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ