amp pages | Sakshi

అందుకే డైరెక్షన్‌ చేయకూడదనుకున్నాను: కోడి రామకృష్ణ కూతురు

Published on Fri, 07/08/2022 - 09:52

‘‘నాకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. నాన్న (కోడి రామకృష్ణ) ద్వారా దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నాను. మా ఆయన కూడా డైరెక్షన్‌ చేయమని ప్రోత్సహించారు. ఇంతలో నాన్న దూరమయ్యారు. దర్శకుడిగానే కాకుండా మంచి వ్యక్తిత్వంతోనూ అభిమానులను సంపాదించుకున్నారు నాన్న. అటువంటిది నేను డైరెక్షన్‌ చేసి ఆయన పేరు చెడగొట్టకూడదని నా నిర్ణయం మార్చుకున్నాను’’ అని నిర్మాత కోడి దివ్య దీప్తి అన్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా నిర్మిస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా, సంజనా ఆనంద్, సిద్ధార్థ్‌ మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ ఫేమ్‌ శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై రూపొందుతున్న ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

నేడు (జూలై 8) కోడి దివ్య దీప్తి బర్త్‌ డే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ఉన్నప్పుడే కిరణ్‌తో సినిమా చేద్దామని కథలు విన్నాను. ‘మనం పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్‌పై కనపడేలా చెయ్యాలి తప్ప వృథా చేయకూడదు’ అని నాన్న ఎప్పుడూ చెప్పేవారు.. ఆ మాటలు మనసులో పెట్టుకొని  ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చేస్తున్నాను. ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 10న పాలకొల్లులో విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్‌ 9న సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. నాకు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలంటే ఇష్టం. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. నా తర్వాతి సినిమా ఏంటనేది త్వరలో చెబుతాను’’ అన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)