amp pages | Sakshi

విక్రాంత్‌ రోణతో ఆ కల తీరింది: కిచ్చా సుదీప్‌

Published on Wed, 07/27/2022 - 08:57

కన్నడ సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్‌ ఎమోషనల్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ కథా చిత్రం విక్రాంత్‌ రోణ. గ్లామర్‌ స్టార్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నాయకిగా నటించారు. ఈ చిత్రాన్ని అనూప్‌ భండారీ దర్శకత్వంలో మంజూనాథ్‌ గౌడ్‌ నిర్మించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ మంగళవారం సాయంత్రం చెన్నైకి వచ్చింది. ఇందులో పాల్గొన్న నటుడు కిచ్చా సుదీప్‌ మాట్లాడుతూ చెన్నైకి ఎప్పుడు వచ్చినా అత్యధిక గౌరవం ఇచ్చి పని ఇచ్చి అభిమానం చూపుతున్నారన్నారు. విక్రాంత్‌ రోణ భారీ యాక్షన్‌ తో కూడిన ఎమోషనల్, అడ్వెంచర్, ఫాంటసీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. మంచి ఇంటెన్స్‌తో కూడిన కథా చిత్రాన్ని చేయాలన్నది తన చిరకాల కోరిక అన్నారు. విక్రాంత్‌ రోణతో ఆ కల తీరిందన్నారు.

(చదవండి: కొత్త రకం హెయిర్‌ స్టయిల్‌లో రజనీకాంత్‌!)

ఇది అందరికీ నచ్చే విధంగా ఉంటుందన్నారు. మంచి కంటెంట్‌తో కూడిన కథ కావడంతో తనకు బాగా నచ్చిందన్నారు. దీనిని ఇంకా ఎలా బాగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లవచ్చు అన్న దానిపై దృష్టి పెట్టామన్నారు. దీంతో త్రీడీ ఫార్మెట్‌ రూపొందించినట్లు చెప్పారు. దర్శకుడు మంచి ఇంటెన్స్‌తో ఫుల్‌ ఎఫెర్ట్‌ పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా చిత్ర పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.

ఈ చిత్రం విడుదల అనంతరం దర్శకుడి గురించి అందరూ చెప్పుకుంటారన్నారు. కాగా ఈ చిత్రాన్ని గత 20 ఏళ్ల క్రితం త్రీడీ ఫార్మెట్‌ వచ్చిన మై డీయర్‌ కుట్టి చేతన్‌ చిత్రంతో పోల్చవద్దని అన్నారు. అది ఒక హిస్టరీ అని పేర్కొన్నారు. ఆ చిత్రం అందించిన త్రీడీ ఎఫెక్ట్‌ మరే చిత్రం ఇవ్వలేదన్నారు. అప్పట్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా దర్శకుడు కొత్త ఇమేజినేషన్, విజన్‌తో తీశారన్నారు. అయితే ఈ చిత్రాన్ని ప్రజెంట్‌ పరిస్థితుల్లో చాలా బాగా రూపొందించినట్లు తెలిపారు. నిజానికి మంచి కథను ఎంపిక చేసుకోవడమే సక్సెస్‌ అని నటుడు కిచ్చా సుదీప్‌ పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌