amp pages | Sakshi

విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. రొమాంటిక్‌ లుక్‌లో మెరిసిపోతున్న క్యూట్‌ కపుల్‌

Published on Tue, 12/14/2021 - 15:15

Katrina Kaif And Vicky Kaushal's Pre-Wedding Photoshoot: బాలీవుడ్‌ జంట క‌త్రినా కైఫ్, విక్కీ కౌశ‌ల్‌ని వివాహం ‍ప్రస్తుతం బాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న విక్కీ, కత్రినా డిసెంబర్‌ 9న పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం క‌త్రినా పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 

కాగా పెళ్లి అయ్యే వరకు వీరి వివాహం గురించి గోపత్య పాటించిన ఈ జంట పెళ్లి తరువాత వరుస పెట్టి ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. ముందుగా పెళ్లి, తరువాత హల్దీ, సంగీత్‌.. తాజాగా ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను విక్కీ, కత్రినా ఇద్దరూ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో సెలెబ్రిటీ డిజైనర్‌ సభ్యసాచి ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో నూతన జంట మెరిసిపోతున్నారు. ఇద్దరూ బేబి పింక్‌ కలర్‌ మ్యాచింగ్‌ కాస్టూమ్స్‌తో ఫర్‌ఫెక్ట్‌ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం, కత్రినా నుదిటిపై విక్కీ ముద్దు పెడుతున్న పిక్స్‌ ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తున్నాయి. 
చదవండి: వైరల్‌ అవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ హాంపర్‌, అందులో ఏం ఉన్నాయంటే..

ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ... ఓ అందమైన కొటేషన్‌ను కూడా పోస్టు చేశారు. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ, కృతజ్ఙత మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’ అంటూ పేర్కొన్నారు. ఈ ఫోటోలు అభిమానులు, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఎంతో అందంగా, చూడముచ్చటగా, మేడ్‌ ఫర్‌ ఇచ్‌ అదర్‌ అనేలా  ఉన్నారు. జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి’ అంటూ కపుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
చదవండి: భార్యభర్తలుగా కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌.. వైరలవుతోన్న వెడ్డింగ్‌ ఫోటోలు..

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)