amp pages | Sakshi

కాళ్లు పైకెత్తి ఊపడమేంటి? బొట్టు లేదు, మెట్టెలు లేవు: కరాటే కల్యాణి

Published on Sat, 07/23/2022 - 18:33

టాలీవుడ్‌ సింగర్‌ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె రిలీజ్‌ చేసిన ఒకపరి పాట పెద్ద వివాదంగా మారింది. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై కరాటే కల్యాణి స్పందించింది.

'శ్రావణ భార్గవి చేసిన వీడియోలో కొన్ని తప్పులున్నాయి. స్వామి సేవలో పాడే కీర్తనకు ఓ ఔన్నత్యం ఉంటుంది. దాని విలువను మనం కాపాడాలే తప్ప కాళ్లు రెండు పైకెత్తి ఊపుతూ చేయడమేంటి? నువ్వు పెళ్లైన అమ్మాయివి. కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు.. శాస్త్రబద్దంగా ఉన్నప్పుడు అవెందుకు పాటించలేదు. ముందు అవి వేసుకో.. కీర్తనలు పాడుకునేటప్పుడు మీ పైత్యాన్ని ఇందులో చూపించొద్దు. కె.విశ్వనాథ్‌ సినిమాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి అంటే.. అప్పుడు నేను పుట్టలేదు. వాళ్లు ఇప్పుడు సినిమాలు చేసినా కూడా అందులో ఏ కీర్తన అయినా అభ్యంతరకరంగా ఉంటే కచ్చితంగా ఖండించాల్సిందే! భార్గవి పాట నాకు అభ్యంతరకరంగా ఉంది. ఆ పాటలో కొన్ని క్లిప్పులు తొలగించేలా చిన్న చిన్న ఎడిటింగ్‌ చేయాల్సిందే!' అని కరాఖండిగా తేల్చి చెప్పింది కల్యాణి. మరోవైపు ఏదేమైనా సాంగ్‌ డిలీట్‌ చేయనని మంకు పట్టిన శ్రావణ భార్గవి చివరకు ఆ పాటను తొలగించడం గమనార్హం.

చదవండి: నా జీవితంలో ఆనందం, ప్రశాంతత లేకుండా పోయాయి
మీరు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను: శ్రీను వైట్ల

Videos

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)