amp pages | Sakshi

హిట్‌ చిత్రాల దర్శకుడితో కమల్‌ మూవీ? 

Published on Mon, 10/31/2022 - 12:54

విక్రమ్‌ చిత్రం అందించిన విజయోత్సవంతో నటుడు కమలహాసన్‌ వరుస చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరో పక్క బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షోకు హోస్ట్‌గా వ్యహరిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇండియన్‌ 2 చిత్రాలు పూర్తి చేసిన తర్వాత మలయాళ దర్శకుడు మహేష్‌ నారాయణన్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు.

కాగా ఆ తర్వాత చేసే చిత్రానికి కూడా కమల్‌హాసన్‌ పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. అజిత్‌ కథానాయకుడిగా నేర్కొండ పార్వై, వలిమై వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హెచ్‌ వినోద్‌ ప్రస్తుతం అదే అజిత్‌ హీరోగా తుణివు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న ఈ  చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తదుపరి ఈయన కమల్‌హాసన్‌ను డైరెక్ట్‌ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్ర కథను దర్శకుడు హెచ్‌.వినోద్‌ ఇటీవల కమల్‌హాసన్‌కు వినిపించారని, ఆయన నటించడానికి సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ఒక యాక్షన్‌ గేమ్‌ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని కోలీవుడ్‌ వర్గాల టాక్‌. కాగా తుణివు చిత్రం విడుదల తర్వాత కమలహాసన్‌ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. 

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)