amp pages | Sakshi

నటనకు గుడ్‌బై? దర్శకురాలిగా మారనున్న రాధికా ఆప్టే?

Published on Fri, 12/30/2022 - 08:43

తమిళసినిమా: నటి రాధికా ఆప్టే గురించి పరిచయం అక్కర్లేదు. అందాల ఆరబోతలో ఈ అమ్మడిని మించిన వారు ఉండరేమో. తమిళంలో ధోని చిత్రంతో నటిగా రంగ ప్రవేశం చేసిన ఈ బాలీవుడ్‌ బ్యూటీ తెలుగు తదితర భాషల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. తమిళంలో రజనీకాంత్‌ సరసన కబాలి చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్నారు. తర్వాత బాలీవుడ్, హాలీవుడ్‌ చిత్రాల్లోనూ బిజీ అయ్యారు.

అయితే తాను నటించిన కథానాయకులపైనే విమర్శలు చేస్తూ వివాదాస్పద నటి అనే ముద్ర వేసుకుంది. అలాంటి ఈ నటి దృష్టి ఇప్పుడు దర్శకత్వంపై పడింది. ఇప్పటి వరకు ఇతరుల డైరక్షన్‌లో నటించిన ఈ బ్యూటీ త్వరలో హీరోలని డైరెక్ట్‌ చేయడానికి సిద్ధం అవుతున్నారట. దీని గురించి ఒక భేటీలో రాధికా ఆప్టే మాట్లాడుతూ దర్శకురాలు కావాలనే మొదట భావించానని చెప్పింది. అయితే అనూహ్యంగా హీరోయిన్‌ అయ్యానని తెలిపింది.

తాను దర్శకత్వం శాఖలో శిక్షణ పొందినట్లు చెప్పింది. అది నటనకు ఉపయోగపడిందని పేర్కొంది. అయితే ఇప్పుడు మెగా ఫోన్‌ పట్టాలని నిశ్చయించుకున్నట్లు చెప్పింది. అయితే స్క్రీన్‌ప్లే రూపొందించడంలో తగిన శిక్షణ పొందాలని, అందుకు ప్రముఖ దర్శకుల వద్ద పని చేయ్యాలనుకుంటున్నట్లు చెప్పింది. అదే సమయంలో కొన్ని కథలను సిద్ధం చేసుకుంటున్నారని చెప్పింది. అలాగని నటనకు స్వస్తి చెబుతున్నానని భావించరాదని, తన తొలి ప్రాధాన్యత నటనకేనని పేర్కొంది. అయితే ఈ అమ్మడు ఏ భాషలో దర్శకత్వం వహించేది మాత్రం చెప్పలేదు.

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)