amp pages | Sakshi

చుక్కల్లారా.. చూపుల్లారా.. ఎక్కడ ‘మా సిరివెన్నెల’?

Published on Tue, 11/30/2021 - 16:35

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు సినీ జగత్తంతా సిరివెన్నెల పరచిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మనకిక లేరు. తొలి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న కారణజన్ముడు ఆయన. న్యూమోనియాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల తిరిగి రాని లోకానికి తరలి పోయారు. దీంతో త్వరగా కోలుకుని ఆయన ఇంటికి తిరిగి చేరుకుంటారన్న కోట్లాదిమంది ఆశలు అడియాశలయ్యాయి. (Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే)

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20న డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు చెంబోలు సీతారామ శాస్త్రి. గేయరచయితగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 2020 వరకు 3000 పాటలకు పైగా సాహిత్యం అందించారు. పదకొండు నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. ఈ రంగంలో ఆయన కేసిన కృషికి గాను  2019లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

జననీ జన్మభూమి సినిమాకు గేయ రచయితగా అరంగేట్రం చేసినప్పటికీ, కే.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల మూవీలో పాటలకుగాను సిరివెన్నెలగా తన పేరును స్థిరపర్చుకున్నారు. ‘ఆది భిక్షువు’ పాటకు ఉత్తమ గీత రచయితగా శాస్త్రి తన మొదటి నంది అవార్డును అందుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ‘బూడిదిచ్చే వాడి నేటి అడిగేది అన్నా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అన్నా అది ఆయనకే చెల్లు.

స్వయం కృషి, స్వర్ణ కమలం, సంసారం, ఒక చదరంగం, శ్రుతిలయలు, పెళ్లి చేసి చూడు వంటి చిత్రాలలో అనేక పాటలకు మాటలు రాశారు.  1986, 1987, 1988లో వరుసగా మూడు సంవత్సరాలలో నంది అవార్డులను గెలుచుకున్న ఘనత ఆయన సొంతం. స్వరకల్పన, అన్న తమ్ముడు, ఇంద్రుడు చంద్రుడు, అల్లుడుగారు, అంతం ,రుద్రవీణ, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలకు తన పాటతో ప్రాణం పోశారు.  ఆ తర్వాతికాలంలో క్షణ క్షణం, స్వాతి కిరణం, మురారి, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, ఎలా చెప్పను, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శుభలగ్నం,  చక్రం, కృష్ణం వందే జగద్గురుం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్‌ చాలా పెద్దదే.

ప్రేమ అయినా, విరహమైనా, దేశభక్తిఅయినా, విప్లవ గీతమైనా ఆయన పాట చెరగని ముద్ర. ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే. ప్రతీ పదమూ హృదయాన్ని తాకేదే. అలనాటి దిగ్గజ రైటర్స్‌ వేటూరి, ఆత్రేయతో పాటు టాలీవుడ్‌లో గొప్ప గేయ రచయితగా తన పేరును సార్థకం చేసుకున్నారు. అంతేకాదు చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, రామ జోగయ్య శాస్త్రి వంటి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన నటుడు, గాయకుడు కూడా. కళ్లు సినిమాలో ‘తెల్లారింది లెగండోయ్‌.. కొక్కొరోకో..’ అంటూ సినీ అభిమానులను నిద్ర లేపిన ఆయన గళం  మూగబోయింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)