amp pages | Sakshi

'ది కశ్మీర్‌ ఫైల్స్‌'.. కక్కుర్తి పడి ఆ లింక్స్‌ ఓపెన్‌ చేయకండి

Published on Mon, 03/21/2022 - 09:08

Download The Kashmir Files: For Free Police Warn Against Free Links: ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ లింక్‌  క్లిక్‌ చేయండి అంటూ మీకు వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. ఫ్రీగా సినిమా చూడొచ్చని కక్కుర్తి పడి లింక్‌ క్లిక్‌ చేశారో.. మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులన్నీ ఖాళీ అయినట్లే. ఎందుకంటే సైబర్‌ నేరగాళ్ల దృష్టి ఇప్పుడు ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై పడింది.

ఈ సినిమాను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఫ్రీలింకులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఢిల్లీ, నోయిడాల్లో హ్యాకర్లు ఇదే పనిగా సైబర్‌ క్రైమ్‌కు పాల్పుడుతున్నారని పోలీసులు తెలిపారు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్‌ఫోన్లను హ్యాక్‌ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసినట్లు చెప్పారు.

ఒకవేళ మీకు ఇలాంటి లింకులు వస్తే 1920 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసులు సూచించారు. కాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే వంద కోట్లు సాధించి సత్తా చాటుతోంది. ప్రముఖ దర్శకుడు  వివేక్‌ అగ్ని హోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)