amp pages | Sakshi

పిల్లలను కనడంపై దీపికా పదుకొణె ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Thu, 01/04/2024 - 14:17

బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌ లిస్ట్‌లో దీపికా పదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌ జంట ఒకటి. ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన రణ్ వీర్ సింగ్, దీపికా.. 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ జంట తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని బెల్జియంలో ఘనంగా జరుపుకుంది. అయితే పెళ్లి చేసుకొని ఐదేళ్లు గడుస్తున్నా..ఇప్పటి వరకు  ఈ జంటకు పిల్లలు లేరు. వరుస సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా కొన్నాళ్ల పాటు పిల్లలను కనకుండా ఉండాలని ఈ జంట భావించిందట. అయితే ఇప్పుడు పిల్లల కోసం ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై దీపికా పదుకొణె పరోక్షంగా స్పందించారు. పిల్లలు అంటే తనతో పాటు రణ్‌వీర్‌కు చాలా ఇష్టమని, సొంత కుటుంబాన్ని ప్రారంభించడం కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని చెప్పింది. అంతే కాదు తన పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారో కూడా దీపికా చెప్పుకొచ్చింది. ‘నేను ఇప్పుడు ఎవరినైనా కలిస్తే చాలా ఎదిగిపోయావని పొగిడేస్తుంటారు. కానీ మా బంధువులు మాత్రం నన్ను ఒక సెలెబ్రిటీలా ట్రీట్‌ చేయరు.

సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నావో..ఇప్పుడు అలానే ఉన్నావని అంటుంటారు. మొదట నేను ఒక కూతురిని.. ఒక సోదరిని.. ఆ తర్వాతే సెలబ్రెటీని! ఫేమ్‌ వచ్చాక మన ప్రవర్తనలో మార్పు రాకూడదు. మా పేరెంట్స్‌ నన్ను అలానే పెంచారు. మా పిల్లల్ని కూడా రణ్‌వీర్‌, నేను అలానే పెంచాలనుకుంటున్నాం. మా పిల్లలకు మంచి విలువలు నేర్పించాలనుకుంటున్నాం’అని దీపికా చెప్పుకొచ్చింది. దీపికా సినిమాల విషయాకొస్తే.. పఠాన్, జవాన్ చిత్రాలతో సక్సెస్‌ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కీ 2898’తో పాటు  శెట్టి దర్శకత్వంలో 'సింగం ఎగైన్'లోనూ నటిస్తోంది. 

Videos

చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి

ఆధారాలు ఉన్నా..నో యాక్షన్..

వైఎస్ఆర్ సీపీనే మళ్ళీ గలిపిస్తాం

ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని

జగన్ వెంటే జనమంతా..

బాబు, పవన్ కు కర్నూల్ యూత్ షాక్

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)