amp pages | Sakshi

చేగువేరా బ‌యోపిక్ 'చే' ఎలా ఉందంటే..

Published on Fri, 12/15/2023 - 17:25

టైటిల్‌: ‘చే’
నటీనటులు:లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్ తదితరులు
నిర్మాణ సంస్థ: బ్యానర్: నేచర్ ఆర్ట్స్
నిర్మాతలు: సూర్య , బాబు, దేవేంద్ర
రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్
సంగీతం: రవిశంకర్‌
సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమి, జగదీష్
విడుదల తేది: డిసెంబర్‌ 15, 2023

క‌థేంటంటే..
విప్ల‌వం బాట ప‌ట్టిన 'చే' (సభావత్ నాయక్) ప‌లు దేశాలు తిరుగుతూ పీడిత‌ జ‌నాన్ని చైత‌న్య ప‌రుస్తుంటాడు. ఓ సారి పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయ‌ప‌డ‌తాడు. గాయ‌ప‌డిన 'చే'ను గిరిజ‌న గ్రామ‌స్తులు కాపాడుతారు. ఆ క్ర‌మంలో  సింగి (లావణ్య) 'చే'ను ప్రేమిస్తుంది. శ‌రీర‌కంగానూ ద‌గ్గ‌ర‌వుతుంది. ఆకలి, నిరక్షరాస్యత, అనారోగ్యం త‌దిత‌ర‌ సమస్యలపై దృష్టిపెడ‌తాడు. కేవలం కడుపు నింపుకోవటం కోసమే పని చేసే పరిస్థితి నుండి ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలని ప్ర‌య‌త్నిస్తాడు. ఈ క్ర‌మంలో పోలీసుల చేతిలో త‌న ద‌ళ స‌భ్యులు చ‌నిపోతారు. చివ‌రికి  'చే' కూడా బొలీవియా సైనిక దళాలకు బందీగా చిక్కుతాడు. ఆ త‌ర్వాత ఏమైందీ? తను ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంది? అనేదే ఈ సినిమా కథ. 



ఎవరెలా చేశారంటే.. 
చేగువేరా పాత్ర‌లో బిఆర్ సభావత్ నాయక్  చక్కగా నటించాడు. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు చేగువేరా ఎలా ఉంటాడో పూర్తిస్థాయిలో చూపించాడు. లీడ్ రోల్‌లో సభావత్ నాయక్ చెప్పిన డైలాగ్‌లు ఈ సినిమా హైలైట్ పాయింట్స్‌గా చెప్పుకోవ‌చ్చు. చే కు జంట‌గా న‌టించిన‌ లావణ్య త‌న పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించింది. ఒక అంద‌మైన‌ అమాయ‌క‌పు గిరిజ‌న అమ్మాయిగా న‌టించి త‌న పాత్ర‌కు ప‌రిపూర్ణ‌త తెచ్చింది. ఇక ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించిన‌ పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్ త‌మ త‌మ పాత్ర‌ల‌ పరిధిమేర నటించారు. 

విశ్లేషణ
విప్లవం అన‌గానే ప్రపంచవ్యాప్తంగా అంద‌రికి గుర్తొచ్చే పేరు చేగువేరా. అలాంటి వీరుడి జీవిత చ‌రిత్ర‌ను తెర‌కెక్కించిన మూవీ ‘చే’.సాధార‌ణ క‌థ‌తో పాటు, చేగువేరా లైఫ్ గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌ని విష‌యాల‌ను  కూడా ఎంతో ఆస‌క్తిగా తెర‌కెక్కించాడు దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్. సినిమాలోని పాత్ర‌లు ఇండియాలో మాదిరిగానే క‌నిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే గిరిజ‌నుల‌ను పోలి ఉంటాయి. చేగువేరా బ‌యోపిక్‌ను మ‌న నెటివికి దగ్గ‌రగా చూపించాల‌న్న ఉద్దేశంతోనే సినిమా తీసిన‌ట్టు మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది.

చరిత్రను తెరపై చూపించడం చిన్న విషయం కాదు..ఉన్నది ఉన్నట్లు చూపించకపోతే చరిత్రకారులు ఒప్పుకోరు.. సినిమాటిక్‌ లిబర్టీ తీసుకోకపోతే ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది. ‘చే’ విషయంలో కూడా అదే జరిగింది. చాలా వరకు చేగువేరా జీవితాన్ని నేచురల్ గా చూపించే ప్రయత్నం దర్శకుడు చేశాడు. కమర్షియల్ హంగులకి పెద్దపీట వేయలేదు. చాలా నిజాయితీగా సినిమాను తెరకెక్కించాడు. టెక్నిక‌ల్ విషయాలకొస్తే..రవిశంకర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌. సినిమాటోగ్రాఫర్లు  కళ్యాణ్ సమి, జగదీష్ ప‌నితీరు బాగుంది.ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు పర్వాలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేని ఓ అతిసాధారణ వ్యక్తి ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించడం నిజంగా అభినందించాల్సిందే.

Videos

Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)