amp pages | Sakshi

ర్యాష్‌ డ్రైవింగ్‌... టాలీవుడ్‌ హీరోపై కేసు నమోదు

Published on Thu, 01/20/2022 - 14:53

సాక్షి, హైదరాబాద్‌: మోతాదుకు మించి మద్యంతాగి బస్తీల్లో అదుపుతప్పిన వేగంతో కారును నడుపుతూ రోడ్డు పక్కన వాహనాలను ఢీకొట్టిన ఘటనలో సినీనటుడు దాసరి అరుణ్‌కుమార్‌(47)పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–71లో నివసించే దాసరి అరుణ్‌కుమార్‌ బుధవారం సాయంత్రం తన మారుతి స్విఫ్ట్‌ కారులో ఫిలింనగర్‌ క్లబ్‌కు షటిల్‌ ఆడేందుకు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో స్నేహితుడు ప్రశాంత్‌ మరొకరితో కలిసి రాత్రి 11 గంటల వరకు మద్యం సేవించాడు.

కొంతకాలంగా మద్యం సేవించిన అనంతరం మత్తులో తన ఇంటిదారి మరిచిపోతున్నాడని కుటుంబ సభ్యులు తెలుపడంతో స్నేహితులు రాత్రి మద్యం తాగిన తర్వాత అరుణ్‌కుమార్‌ కారు ఎక్కగానే వెనుకాల అనుసరిస్తూ వెళ్లారు. అయితే కొద్దిదూరం వెళ్లేసరికి అరుణ్‌కుమార్‌ కారును స్పీడ్‌గా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–12 వైపు పోనిచ్చాడు. వెనుకాల స్నేహితులు గుర్తించే లోపే కారును అదుపుతప్పిన వేగంతో తీసుకెళ్తూ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–12 కమాన్‌లోపల సయ్యద్‌నగర్‌ బస్తీలోకి వెళ్లాడు. 11.20 గంటల ప్రాంతంలో సయ్యద్‌నగర్‌బస్తీలో రోడ్డు పక్కన ఆపిన ఐదు వాహనాలను ఢీకొట్టాడు. ఒక్కసారిగా అధిక శబ్ధం, వాహనాలను ఢీకొడుతున్న శబ్ధాలతో స్థానికులు అక్కడికి పరుగులు తీసి చాకచక్యంగా అరుణ్‌ నడుపుతున్న కారును ఆపారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు అరుణ్‌ ప్రయత్నించగా స్థానికులంతా చుట్టుముట్టి కారును ఆపారు. బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు నడుపుతున్న వ్యక్తి సినీహీరో దాసరి అరుణ్‌గా గుర్తించారు. అదే రాత్రి అరుణ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కారు సీజ్‌ చేశారు. వెంటనే మద్యం మోతాదు పరీక్షలు నిర్వహించగా 405 బీఏసీగా తేలింది. బాధితులు సయ్యద్‌ అఫ్జల్‌అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై ఐపీసీ సెక్షన్‌ 279, 336, ఎంవీ యాక్ట్‌ 185 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

అట్రాసిటీకేసుపై విచారణ 
దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గత ఏడాది ఆగస్టు 16వ తేదీన నమోదైంది. ఈ కేసులో విచారణ నిమిత్తం గురువారం బంజారాహిల్స్‌ పోలీసులు అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటల పాటు ఆ కేసుకు సంబంధించి విచారణ జరిగింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌