amp pages | Sakshi

ప్రియాంక సింగ్‌కు సపోర్ట్‌ చేయం: హిజ్రా ఫౌండర్‌

Published on Wed, 11/10/2021 - 20:37

కామెడీ షోలో లేడీ గెటప్స్‌ వేసిన సాయి తేజ ఆ తర్వాత ఆపరేషన్‌ చేయించుకుని అమ్మాయిగా మారిపోయాడు. ప్రియాంక సింగ్‌గా పేరు మార్చుకున్న అతడు తనకు వచ్చిన ఆఫర్‌ను అందిపుచ్చుకుని బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్నాడు. అయితే ప్రియాంక సింగ్‌ ఎవరో తనకు తెలీదని, ఆమెకు సపోర్ట్‌ చేయమని తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్‌ చంద్రముఖి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

"ట్రాన్స్‌జెండర్‌గా మారడం అంటే అంత ఈజీ కాదు. నాలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని సైక్రియాట్రిస్ట్‌కు చెప్తే అతడు ఓ రెండేళ్లపాటు ఆడపిల్లలా బట్టలు వేసుకోమంటాడు. రెండేళ్లు కౌన్సిలింగ్‌ ఇస్తాడు. దీని తర్వాత కూడా అమ్మాయిగానే ఉండాలనిపిస్తే అప్పుడు సర్జరీ చేయించుకోమంటారు. అంతేకానీ 24 గంటలు చీర కట్టుకొని బాడీలో ఫెమినిటీని పెంచుకోవడం వేరు, పుట్టినప్పుడే ఫెమినిటీతో పుట్టడం వేరు. కొందరు ఆడపిల్ల గెటప్స్‌ వేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని పూర్తిగా ఆడపిల్లగా మారి ఇంకా ఎక్కువ సంపాదిద్దాం అనుకుంటారు. అక్కా నాకు ఆడపిల్లలా అవ్వాలని ఉందని ఎందరో నా సోషల్‌ మీడియా అకౌంట్లలో కామెంట్లు పెడుతూ ఉంటారు.సెక్స్‌ వర్క్‌ చేసో, అడుక్కునో బతకడం కన్నా ఉద్యోగం చేసి బతకమని కౌన్సెలింగ్‌ ఇస్తుంటాను. అలాగయితేనే జీవితంలో గౌరవంగా బతుకుతారని చెప్తాను.

బిగ్‌బాస్‌ షోలోకి ట్రాన్స్‌జెండర్లను తీసుకొస్తున్నారు. గతంలో తమన్నా, ఈసారి ప్రియాంకను తెచ్చారు. అయితే ఆమె గురించి నాకు పెద్దగా తెలీదు. కేవలం టీవీలో చూడటం వరకే తెలుసు, అది కూడా సాయిగానే తెలుసు. తను ట్రాన్స్‌జెండర్‌ అయ్యారని నాకు తెలియదు. మా కమ్యూనిటీలో ఉండి ఉంటే మా సపోర్ట్‌ ఉండేది. లేదు కాబట్టి ఎటువంటి సపోర్ట్‌ ఉండదు. గతంలో తమన్నా బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు సపోర్ట్‌ చేశా. ఎందుకంటే ఆమె మా కమ్యూనిటీలో ఉంది కాబట్టి! ఇప్పటికీ తమన్నా, నేను మంచి స్నేహితులం" అని చెప్పుకొచ్చారు చంద్రముఖి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌