amp pages | Sakshi

బిగ్‌బాస్ వీక్ష‌కుల‌కు బ్రేకింగ్ న్యూస్‌: నాగార్జున‌

Published on Sat, 10/16/2021 - 18:50

బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం జ‌రిగిన గొడ‌వ‌ల‌ను తిర‌గ‌దోడుతున్నాడు నాగార్జున‌. త‌ప్పొప్పుల‌ను ఎత్తిచూపుతూ కంటెస్టెంట్ల‌తో పంచాయితీ పెడుతున్నాడు. ఇదంతా ప‌క్క‌న‌పెడితే రేపు జ‌ర‌గాల్సిన ఎలిమినేష‌న్‌ను ఈరోజే జ‌రిపించేలా ఉన్నాడు నాగ్‌. తాజాగా రిలీజైన ప్రోమోలో అంద‌రికీ ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్ప‌బోతున్నాన‌నంటూ స‌స్పెన్స్ పెట్టాడు. ఈ హౌస్‌లో ఉండేందుకు అర్హ‌త లేనివాళ్లు ఎవ‌రో చెప్పండి? అంటూ ఒక్కొక్క‌రినీ క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి మ‌రీ అడిగాడు. ఈ క్ర‌మంలో అంద‌రూ త‌లా ఒక‌రి పేరు చెప్పారు. ఫైన‌ల్‌గా ప్రియ‌కు, లోబోకు ఇద్ద‌రికీ 4 ఓట్లు ప‌డ్డాయి. దీంతో నాగ్‌.. వీరిలో ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తారో వారి ప‌క్క‌న నిల్చోమ‌ని ఇంటిస‌భ్యుల‌ను ఆదేశించాడు. మ‌రి మెజారిటీ హౌస్‌మేట్స్ ఎవ‌రిని సేవ్ చేసే అవ‌కాశం ఉంది? ఎవ‌రిని హౌస్‌లో నుంచి పంపించేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే నెటిజ‌న్లు మాత్రం ఆ ఇద్ద‌రిలో ఎవ‌రిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్‌కు పంపించినా పెద్ద ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని పెద‌వి విరుస్తున్నారు. కావాలంటే డ‌బుల్ ఎలిమినేష‌న్ పెట్టండ‌ని సూచిస్తున్నారు. ఇక‌ ప్రోమో ఈ రేంజ్‌లో ఉన్న‌ప్ప‌టికీ ప్రియ‌, లోబో ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలైతే లేన‌ట్లే క‌నిపిస్తోంది. ఇలా అర్ధాంత‌రంగా వారిని హౌస్‌లోంచి వెళ్ల‌గొట్టే సాహ‌సం చేయ‌ర‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి నాగ్ నిజంగానే బ్రేకింగ్ న్యూస్ చెప్తాడా?  లేదా జ‌నాల‌ను ప్రాంక్ చేస్తాడా? అన్న‌ది చూడాలి!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)