amp pages | Sakshi

బిగ్‌బాస్‌: సోహైల్‌కు గ‌ట్టి షాక్‌ ఇచ్చిన మెహ‌బూబ్

Published on Fri, 11/06/2020 - 18:00

బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం అమ్మ రాజ‌శేఖ‌ర్ కెప్టెన్ అయ్యాడు. త‌న‌ను నామినేట్ చేసిన ఒక్కొక్క‌రికీ బొమ్మ చూపిస్తున్నాడు. నా మాటే శాస‌నం అన్న‌ట్లుగా తాను చెప్పిన ప‌నులే చేయాలంటున్నాడు. కాదూ కుద‌ర‌దు అన్న‌వాళ్ల‌కు మ‌రో అవ‌కాశం కూడా ఇవ్వ‌ట్లేదు. హౌస్‌లో ఇప్పుడు త‌నే బిగ్‌బాస్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అత‌ని వైఖ‌రిని అభిజిత్ టీమ్ జీర్ణించుకోలేక‌పోతోంది. అలాగే మాస్ట‌ర్ త‌న‌కు కావాల్సిన అవినాష్‌, మెహ‌బూబ్‌కు చిన్నాచిత‌కా ప‌నుల‌ను అప్ప‌జెప్పి, మిగ‌తా వాళ్ల‌కు రెట్టింపు ప‌నుల‌ను కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. ఇది క‌రెక్ట్ కాద‌ని సోహైల్ ఖండించాడు. కానీ అత‌డి మాట‌ల‌ను మాస్ట‌ర్ ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. 'నా నిర్ణ‌యం మార్చుకోను. మీరు చేయ‌క‌పోతే వ‌దిలేయండి' అని దురుసుగా జ‌వాబిచ్చాడు.

హౌస్‌లో కుంప‌టి రాజేస్తున్న మాస్ట‌ర్‌
దీంతో హారిక తాను చేయ‌నని అక్క‌డి నుంచి విసురుగా వెళ్లిపోయింది. ఎవ‌రికి ఏ ప‌నులు చేయాల‌ని ఉందో తెలుసుకోకుండా నా కెప్టెన్సీ అంటూ ఎవ‌డి ద‌గ్గ‌ర జులుం ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని హారిక మండిప‌డింది. ఇక అభిజిత్ ఇంగ్లీషులో మాట్లాడ‌గా బిగ్‌బాస్ తెలుగులో మాట్లాడ‌మ‌ని వార్నింగ్ ఇచ్చాడు. ఈ స‌మ‌యం కోసే ఎదురు చూస్తున్న‌ట్లు మాస్ట‌ర్ వెంట‌నే లేచి చ‌ప్ప‌ట్లు కొడుతూ అభిని శిక్షించేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో అయిపోయావ్ అభి అని లాస్య ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. మ‌రోవైపు మెహ‌బూబ్ కూడా ప్లేటు ఫిరాయించిన‌ట్లు క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: మాస్టర్‌ సంచలన నిర్ణయం.. భోరుమన్న మెహబూబ్‌)

బ‌య‌ట‌ప‌డ్డ మెహ‌బూబ్ నిజ స్వ‌రూపం
"మీ ఫ్రెండ్‌షిప్ వ‌ద్దు, ఏం వద్దు" అంటూ త‌న‌ను గుడ్డిగా న‌మ్మిన సోహైల్‌కు మెహ‌బూబ్ గ‌ట్టి షాకిచ్చాడు. ఏదైతేనేం తొలిసారి కెప్టెన్ అయిన అమ్మ రాజ‌శేఖ‌ర్ హౌస్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాడు. ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు అమ్మ రాజ‌శేఖ‌ర్ ఏకంగా ట్రోఫీ గెలిచిన‌ట్లు ఫీల్ అవుతున్నాడ‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈరోజు అంద‌రి మీద ప్ర‌తీకారం తీర్చుకునేలా ఉన్నాడ‌ని, ప‌నిలో ప‌నిగా ఫుటేజీ ద‌క్కించుకునేందుకు ఈ ఆరాట‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎంత ఎగిరెగిరి ప‌డ్డా ఇంకా రెండురోజులే అత‌ని ఆట‌లు సాగుతాయ‌ని చెప్తున్నారు. కానీ అత‌డి వ‌ల్ల సోహైల్‌కు ఓ ర‌కంగా మంచే జ‌రిగిందంటున్నారు. స్నేహం ముసుగు ధ‌రించిన మెహ‌బూబ్ నుంచి విముక్తి ల‌భించింద‌ని చెప్పుకొస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మోనాల్ కోసం మెహ‌బూబ్ బ‌ల‌వుతాడా?)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)