Breaking News

ఆస్పత్రిలో కమెడియన్‌ రోహిణి.. సర్జరీ కోసం వెళ్తే..

Published on Sun, 05/14/2023 - 19:22

బుల్లితెర సీరియల్స్‌ ద్వారా ఫేమస్‌ అయిన రోహిణి తర్వాత బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. జబర్దస్త్‌లోనూ తన కామెడీ టైమింగ్‌, పంచులతో కమెడియన్‌గా రాణిస్తోంది. బుల్లితెరకే పరిమితం కాకుండా అటు వెండితెరపైనా సత్తా చాటుతోంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇటీవల రోహిణి ఆస్పత్రిలో చేరింది. తన కాలు సర్జరీ కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు పేర్కొంది. ఈ మేరకు రౌడీ రోహిణి అనే తన యూట్యూబ్‌ ఛానల్‌లో వీడియో రిలీజ్‌ చేసింది. ఈ వీడియోలో తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించింది.

'2016లో నాకు యాక్సిడెంట్‌ అయింది. అప్పుడు నేను బెడ్‌ పై నుంచి లేవలేని పరిస్థితి. అమ్మే నన్ను దగ్గరుండి చూసుకుంది. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ కన్నీళ్లొస్తాయి. యాక్సిడెంట్‌లో నా కాలు ఫ్రాక్చర్‌ అయితే రాడ్డు వేశారు. షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండటంతో ఇంతవరకు ఈ రాడ్‌ తీయించలేదు. డ్యాన్స్‌ చేసేటప్పుడు రాడ్‌ వల్ల కొన్ని మూమెంట్స్‌ చేయలేకపోయేదాన్ని. చాలా సంవత్సరాలవుతోందని రాడ్డు తీయించడానికి ఆస్పత్రికి వెళ్లాను' అని చెప్పుకొచ్చింది.

ఆస్పత్రికి వెళ్లి అన్నిరకాల పరీక్షలు చేయించుకుంది రోహిణి. రాడ్‌ తీయడం కోసం ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. తీరా రాడ్డు లోపల కూరుకుపోయిందని, ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదని వైద్యులు తెలిపారు. బలవంతంగా రాడ్డును బయటకు లాగితే ఎముక విరిగే ప్రమాదం ఉండటంతో దాన్ని అలాగే ఉంచేశామని పేర్కొన్నారు. దీంతో రాడ్డు తీసేస్తున్నారన్న ఆనందం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు.

చదవండి: ది కేరళ స్టోరీ డైరెక్టర్‌, హీరోయిన్‌కు యాక్సిడెంట్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)