amp pages | Sakshi

సోహైల్‌కు అవమానం, సన్నీపై విరుచుకుపడ్డ అఖిల్‌!

Published on Sat, 02/05/2022 - 14:04

తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ విన్నర్‌ వీజే సన్నీ నటించిన తాజా చిత్రం సకలగుణాభిరామ. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీజే సన్నీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.

గెలుస్తాడనుకుంటే నాల్గో సీజన్‌లో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేశావంటూ సోహైల్‌ గురించి చులకనగా మాట్లాడాడు. 'నాల్గో సీజన్‌లో సోహైల్‌ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ వీడు డబ్బులు తీసుకుని వచ్చేశిండు. నన్ను కూడా అందరూ అంతే అన్నారు. నీకన్నా 10 లక్షలు ఎక్కువే పెట్టిర్రు. అయినా సరే టెంప్ట్‌ కాలేదు. కళావతి(సన్నీ తల్లి)కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా' అని గర్వంగా చెప్పుకొచ్చాడు సన్నీ.

ఈ కామెంట్లపై సోషల్‌ మీడియాలో దుమారం చెలరేగుతోంది. గెలిచాక సన్నీకి గర్వం తలకెక్కిందని కామెంట్లు చేస్తున్నారు. స్టేజీమీద అందరి ముందు సోహైల్‌ను అవమానించడం సబబు కాదని మండిపడుతున్నారు. ఈ కామెంట్లపై అఖిల్‌ పరోక్షంగా స్పందించాడు. సన్నీ పేరు తీయకుండానే అతడిపై మండిపడ్డాడు. 'ఎవరినైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వారిని గౌరవించాలే తప్ప అవమానించకూడదు. మనం హీరో అవడానికి పక్కవాళ్లను జీరో చేయొద్దు బ్రదర్‌. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజీ మీద చూడటం చాలా బాధనిపించింది. అప్పుడు నేనక్కడ ఉంటే బాగుండేది!' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఆ పోస్ట్‌ డిలీట్‌ చేశాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌