amp pages | Sakshi

బిగ్‌బాస్‌పై యాంకర్‌ రవి తల్లి షాకింగ్‌ కామెంట్స్‌

Published on Fri, 12/10/2021 - 12:42

Anchor Ravi Mother Shocking Comments On Bigg Boss: యాంకర్ రవి.. బిగ్‏బాస్ హౌస్ నుంచి అనుహ్యాంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. ఇప్పటికీ రవి ఎలిమినేషన్‌ షాకింగ్‌గానే ఉంది. టాప్‌ 3లో ఉండాల్సిన రవి ఎలిమినేట్ కావడంతో అతని అభిమానులు చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి రవి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ఇటీవల ప్రచారం జరిగింది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ క్రమంలో రవి తల్లి కూడా కొడుకు ఎలిమినేషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

చదవండి: మంచు లక్ష్మిపై ఆర్జీవీ ప్రశంసలు, మురిసిపోతున్న నటి

కాగా రవి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చిన అనంతరం అతడి ఫ్యాన్స్‌ డ్యాన్స్‌, డిజేతో గ్రాండ్‌గా వెల్‌కం చెప్పారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మీడియాతో రవి తల్లి ఉమరాణి ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవి బయటకు రావడంపై మీ అభిప్రాయం ఏంటని ఆమెను అడగ్గా.. ప్రెషర్‌ కుక్కర్‌ నుంచి బయట పడినట్టు ఉందని చెప్పింది. అంతేగాక రవిని వాళ్లు ఎన్‌కౌంటర్‌ చేసినట్టు అనిపిస్తోందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ‘నా కొడుకు టాప్‌ 5లో ఉండాల్సిన వాడు ఇలా ఎలిమినేట్‌ అవడం ఆశ్చర్యంగా ఉంది. అతడు గేమ్‌ ఆడాడు. పిచ్చి చేష్టలు చేసి రాలేదు. ఊరికే కూర్చోని తినలేదు. రవి గేమర్‌. తెలివిగా ఆడాడు.

చదవండి: ప్రభాస్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డు

మీకు ఆట ఆడేవాళ్లు, మంచివాళ్లు అవసరం లేదని అర్థమైంది. కావాలని పిలిచి తీసుకెళ్లారు. కానీ ఆ హోదా ఇవ్వలేదు. మీరు ఇచ్చేది ఏంటి వీళ్లు ఇస్తున్నారు చాలు. అది రెస్పెక్ట్‌ అంటే’ అంటూ అక్కడే ఉన్న ఫ్యాన్స్‌ను చూపించింది. అలాగే బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండే కంటెస్టెంట్‌ సాధారణ వ్యక్తులు కాదని, వారంతా సెలబ్రెటీలు అంది. ‘సెలబ్రెటీలను పట్టుకు తీసుకెళ్లి మేకల్లా, గొర్రెల్లా ఉంచారు. అదే ఇండస్ట్రీలో ఉంటూ సేమ్‌ ఇండస్ట్రీ వారిని అవమానిస్తున్నారు. రవి అనే కాదు ప్రతి కంటెస్టెంట్‌కు ఇది ఫేర్‌ కాదు.  ఇది ఎప్పటికి సరైనది కాదు. ఇప్పటికైన కాన్సెప్ట్‌ మార్చండి. లేకపోతే బిగ్‌బాస్‌ ఎవరూ చూడరు’ అంటూ రవి తల్లి ఉమరాణి బిగ్‌బాస్‌పై మండిపడింది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)