amp pages | Sakshi

బిగ్‌బాస్‌: అభిజిత్‌ను పంపించేస్తోన్న నాగార్జున‌!

Published on Sat, 11/28/2020 - 17:59

బిగ్‌బాస్ షో అంటే ఒక మ‌నిషి ఎలా ఉంటాడో చూపించ‌డ‌మే కాదు. అత‌డి శ‌క్తి సామ‌ర్థ్యాలు కూడా వెలికి తీస్తూ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేయ‌డం. కానీ ఈ సీజ‌న్‌లో ఈ రూల్ బ్రేక్ అవుతోంద‌ని తేట‌తెల్ల‌మ‌వుతోంది. కొంద‌రు టాస్కుల్లోనే విప‌రీతంగా క‌ష్ట‌ప‌డుతుండ‌గా, మ‌రికొంద‌రు మాత్రం ఎలా ఉన్నామో అలానే ఉంటే స‌రిపోతుందంటై వేటిలోనూ ఆస‌క్తి చూపించ‌కుండా బ‌ద్ధ‌క‌స్తులుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. విచిత్ర‌మేమిటంటే ఇక్క‌డ మొద‌టి కేట‌గిరీవారిక‌న్నా బ‌ద్ధ‌క‌స్తుల కేట‌గిరీలోని వారికే అభిమానులు మెండుగా ఉన్నారు. అయితే ప్ర‌తిసారి టాస్కులు త‌న వ‌ల్ల కాదంటూ చేతులెత్తేస్తే బిగ్‌బాస్ చూస్తూ ఊరుకోడు. అందులోనూ ఇది ప‌న్నెండో వారం. షో ముగింపుకు వ‌స్తున్నా కూడా బిగ్‌బాస్ ఆదేశాలను బేఖాత‌రు చేయ‌డాన్ని నాగార్జున కూడా స‌హించ‌లేక‌పోయాడు. వెర‌సి నేటి ఎపిసోడ్‌లో నాగ్‌ అభిజిత్‌కు చీవాట్లు పెట్టాడు. 

మోనాల్‌ను డేట్‌కు తీసుకెళ్ల‌ని అభిజిత్‌
జ‌ల‌జ ద‌య్యం ఇంట్లో వాళ్ల‌ను ఎలా ఆడేసుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ ద‌య్యం ఇంటిస‌భ్యుల‌కు టాస్కులు కూడా ఇచ్చింది. చెట్టుకున్న ఆకులు లెక్క‌పెట్ట‌మ‌ని అభిని ఆదేశించింది. కొమ్మ‌కు 50 ఆకుల చొప్పున సుమారు ఇంత అని చెప్పేస్తాను అని లెక్క‌లు వేసుకున్నాడు.. మ‌ళ్లీ అంత‌లోనే ఈ ఆకులు లెక్కించాలంటే అవ‌న్నీ తెంపాల‌ని, అలా చేయ‌డం బిగ్‌బాస్ నియ‌మాల‌ను ఉల్లంఘించిన‌ట్లేన‌ని టాస్కు చేయ‌కుండా తెలివిగా జారుకున్నాడు. త‌ర్వాత‌ అఖిల్‌, అభిజిత్‌.. మోనాల్‌ను ఏడిపించిన కార‌ణంగా ఈ ఇద్ద‌రిలో ఒక‌రు ఆమెను డేట్‌కు తీసుకెళ్లాలంటూ మ‌రో టాస్క్ ఇచ్చింది. ఎప్పుడు ఏడిపించాను? ఎందుకు డేట్‌కు తీసుకెళ్లాలి? అని అభి జుట్టు పీక్కుని ఏడ్చినంత ప‌ని చేశాడు. మోనాల్‌తో త‌న‌ను క‌ల‌పొద్దు అంటున్నా ఇప్ప‌టికీ అదే జ‌రుగుతోంద‌ని అని అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఏదైతే అది అయింద‌ని అస‌లు ఈ టాస్కే చేయ‌న‌ని తేల్చి చెప్పేశాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ స్కెచ్‌: టాప్ 5లోకి అవినాష్‌!)

హౌస్ నుంచి పంపించేస్తాన‌ని వార్నింగ్‌
తాజా ప్రోమోలో ఇదే విష‌యాన్ని నాగార్జున లేవనెత్త‌గా.. మోనాల్‌ను ఏడిపించ‌లేదు అంటూ అభి త‌న‌ను తాను స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో నాగ్.. అభి మాట్లాడిన‌ వీడియో చూపించాడు. నువ్వు చెప్పిన మాట‌లే బిగ్‌బాస్ టాస్క్‌లో పంపించాడు అని స్ప‌ష్టం చేశాడు. దీంతో అభి క్ష‌మాప‌ణ చెప్ప‌గా నాగ్ అందుకు అంగీక‌రించ‌లేదు. ఇది మొద‌టి సారి కాదని సీరియ‌స్ అయ్యాడు. త‌ప్పు చేయ‌డం సారీ చెప్ప‌డం అల‌వాటు అయింద‌ని మండిప‌డ్డారు. టాస్కు చేయ‌క‌పోవ‌డం త‌ప్పు అని చెప్తూ గేట్లు ఓపెన్ చేయండి.. అని అభిని భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అత‌డు టాస్క్ చేయ‌నంటే స‌పోర్ట్ చేసిన కెప్టెన్ హారిక‌ను కూడా నాగ్ నిల‌దీశాడు. అయితే ఇలా కంటెస్టెంట్ల‌ను ఉన్న‌ఫ‌ళంగా పంపించేస్తామ‌ని బెదిరించ‌డం కొత్తేమీ కాదు. రెండో సీజ‌న్‌లో గ‌ణేశ్‌ను, మూడో సీజ‌న్‌లో మ‌హేశ్‌ను నాల్గో సీజ‌న్‌లో హారిక‌తో మ‌రికొంద‌రిని కూడా ఇలానే అర్ధాంత‌రంగా పంపించేస్తామ‌ని భ‌య‌పెడుతూనే ఉన్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌లోకి జలజ.. గజ గజ వణికిన బోల్డ్‌ గర్ల్‌)

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)