amp pages | Sakshi

ఈ ఇద్ద‌రిలో ఒక‌రే బిగ్‌బాస్ విజేత‌: కౌశ‌ల్

Published on Wed, 11/18/2020 - 17:18

పోటీదారులు ఎంత‌మంది ఉన్నా విజేత ఒక్క‌రే. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ట్రోఫీ కోసం ఎనిమ‌ది మంది పోరాడుతున్నారు. అభిజిత్‌, అఖిల్‌, హారిక‌, సోహైల్‌, మోనాల్‌, అరియానా, అవినాష్‌, లాస్య ఎవ‌రికి వారే టైటిల్ ద‌క్కించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే వారు బ‌ల‌హీన‌త‌ల‌ను అధిగ‌మించి, ఎమోష‌న్స్‌ను జ‌యించి,  బ‌లాన్ని కూడ‌దీసుకుని, టాస్కుల‌ను ఒంటిచేత్తో పూర్తి చేసి విజ‌యాన్ని అందుకునేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. కానీ ఎంత క‌ష్ట‌ప‌డ్డా వీరిలో ఐదుగురు మాత్ర‌మే గ్రాండ్‌ ఫినాలే వ‌ర‌కు వెళ్తారు. అందులో ఒక్క‌రికే టైటిల్ సొంత‌మ‌వుతుంది. అలా మ‌రో మూడు వారాల్లో  షోకు శుభం కార్డు ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో ట్రోఫీని అందుకునే అవ‌కాశం ఎవ‌రికి పుష్క‌లంగా ఉంద‌నే విష‌యాన్ని బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంటు కౌశ‌ల్ మండా వెల్ల‌డించాడు. కానీ హౌస్‌లో ఒక‌టి అనుకుంటే మ‌రొక‌టి జ‌రుగుతోంద‌ని చెప్పుకొచ్చాడు. ఆయ‌న ఇంకా ఏమేం అన్నాడో అత‌డి మాట‌ల్లోనే..

సీక్రెట్ రూమ్ అట్ట‌ర్ ఫ్లాప్‌..
అభిజిత్‌.. మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఫిజిక‌ల్‌గా స్ట్రాంగ్ కాక‌పోవ‌చ్చు. కానీ అత‌డు చెప్పే ప్ర‌తీదీ జ‌నాల‌కు అర్థ‌మ‌య్యేట్టు చెప్తాడు. మా సీజ‌న్‌లో త‌నీష్‌కు ఆ అల‌వాటు ఉంది. ఇత‌డు క‌చ్చితంగా టాప్ 2లో ఉంటాడు. సోహైల్‌.. మంచి ప్లేయ‌ర్‌. కోప‌మే అత‌డి బ‌లం. అత‌డు కోపంలో మాట్లాడే మాట‌లు విని ఎంజాయ్ చేయొచ్చు. సోహైల్ కూడా ప‌క్కా టాప్ 2లో ఉంటారు. అఖిల్‌.. మిగ‌తావాళ్ల‌తో పోలిస్తే బాగా ఆడ‌తాడు. మొద‌ట్లో మోనాల్‌తో ట్రాక్ న‌డిపాడు. కానీ స‌డ‌న్‌గా ఆ రిలేష‌న్‌షిప్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు. త‌ర్వాత మ‌ళ్లీ గేమ్‌లోకి వ‌చ్చాడు. అఖిల్‌ సీక్రెట్ రూమ్‌కు వెళ్తున్నాడ‌ని అత‌నితో పాటు ఇంటిస‌భ్యుల‌కు కూడా తెలుసు. అయితే ప్ర‌తి సీజ‌న్‌కు సీక్రెట్ రూమ్ వ‌ర్క‌వుట్ కాదు. పైగా అఖిల్ ఆ సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లి టెంప‌ర్ లూజ్ అయ్యాడు. అదే అత‌డికి మైన‌స్ అవుతోంది. (చ‌ద‌వండి: మొద‌టిసారి నాకు ముద్దు పెట్టావు: అఖిల్‌)

అవినాష్ కామెడీ త‌గ్గించేశాడు
అవినాష్‌.. కామెడీ చేస్తున్నాడు, గేమ్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. కానీ చిల్ల‌ర కామెడీ అన్న‌ప్ప‌టి నుంచి కామెడీ త‌గ్గించేశాడు. ఎత్తుకు పై ఎత్తుకు వేసుకుంటూ వెళ్తే టాప్ 5లోకి వెళ్తాడు. అరియానా.. అగ్రెసివ్‌. ఒక‌సారి పీక్స్‌కు వెళుతుంది మ‌ళ్లీ డ్రాప‌వుట్ అవుతుంది. అదే పీక్‌నెస్‌ మెయింటెన్ చేస్తే బాగుంటుంది. ఇక అవినాష్, అరియానా మ‌ధ్య బంధం బ‌లంగా ఉంది. హారిక.. ఇద్ద‌రు ముగ్గురితోనే మాట్లాడుతుంది. అంద‌రితో ఓపెన్ అవ్వ‌ట్లేదు. క్యూట్ అండ్ బ‌బ్లీనెస్‌తోనే ఉండిపోతోంది. కానీ అక్క‌డ‌ స‌మ‌యం మించిపోతోంది. అయినా స‌రే త‌ర్వాత చేద్దాం, త‌ర్వాత ఆడ‌దాం అనుకుంటే కుద‌ర‌దు. ఇప్ప‌టి నుంచే ఆడాల్సిందే. (చ‌ద‌వండి: అరియానా నాకు కాంపిటీష‌నే కాదు: లాస్య‌)

లాస్య అస‌లు స్వ‌రూపం చూపించాలి
లాస్య‌.. గేర్ లేని కారును న‌డుపుతున్న‌ట్లుగా ఆమె ఆట ఉంది. మొద‌టి నుంచి కూల్‌గా వెళ్తోంది. అంద‌రూ ఆమె న‌వ్వునే చూశారు, కానీ కోపాన్ని కూడా చూడాల‌నుకుంటున్నారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడు అస‌లు స్వ‌రూపాన్ని చూపింస్తుంద‌ని కోరుకుందాం. మోనాల్.. ఇప్పుడిప్పుడే రియ‌లైజ్ అవుతోంది. అఖిల్‌తో రిలేష‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి గేమ్ మీద దృష్టి పెడితే బాగా ఆడ‌గ‌ల‌దు. భాష రాక‌పోవ‌డం వ‌ల్ల చెప్పాల‌నుకున్న‌ది క‌రెక్ట్‌గా చెప్ప‌లేక‌పోతోంది. ఎమోష‌న‌ల్‌గా కాకుండా అగ్రెసివ్‌గా ఆడితే బాగుంటుందని కౌశ‌ల్‌ చెప్పుకొచ్చాడు. మ‌రి ఈ జోస్యం ఎంత‌వ‌రకు నిజ‌మ‌వుతుందో చూడాలి. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : నీకు పడిపోతా అవినాష్‌.. అరియానా)

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)