amp pages | Sakshi

హారిక అర్హురాలు కాదు: బాంబు పేల్చిన అభి

Published on Mon, 12/14/2020 - 15:49

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ప‌దిహేనో వారంలో ప్ర‌స్తుతం ఐదుగురు కంటెస్టెంట్లు మాత్ర‌మే మిగిలారు. వీరు ఎన్నో ఆటంకాల‌ను దాటుకుంటూ, స‌మ‌స్య‌ల‌కు ఎదురీదుతూ ప్రీ ఫైన‌ల్స్ నుంచి ఫైనల్స్‌కు అర్హ‌త సాధించారు. ముందైతే టాప్ 5లో అర్హ‌త సాధించాల‌ని క‌ల‌లు నెర‌వేర‌డంతో అభిజిత్‌, అఖిల్‌, సోహైల్‌, హారిక‌, అరియానా ఇప్పుడు క‌ప్పు గెలిచేందుకు తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. వీరి గెలుపు అంతా ప్రేక్ష‌కుల మీద ఆధార‌ప‌డి ఉంది. ఎవ‌రు విన్న‌ర్ అవుతారో, ఎవ‌రు ర‌న్న‌ర‌ప్‌గా నిలుస్తారో అనేది తేల‌డానికి కేవ‌లం వారం రోజులు మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో బిగ్‌బాస్ ఫైన‌లిస్టుల‌తో ఓ ఆటాడించాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: నెర‌వేర‌ని మోనాల్ క‌ల‌!)

ఇప్పుడున్న ఐదుగురిలో విజేత అవ‌డానికి అర్హ‌త లేని ఇంటి స‌భ్యుడి పేరు చెప్ప‌మ‌ని ఆదేశించాడు. దీంతో అభిజిత్‌.. హారిక అర్హురాలు కావ‌ద్దు అనుకుంటున్నాన‌ని చెప్పి బాంబు పేల్చాడు. అయితే హారిక‌ విజేత అయ్యేందుకు అర్హురాలు కాద‌న్నాడా? లేదా చివ‌ర‌లో ఉండేందుకు అర్హురాలు కాద‌న్నాడా? అనేది తెలియాల్సి ఉంది. అఖిల్‌, హారిక.. టైటిల్ గెలిచేందుకు అరియానా అన‌ర్హురాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంద‌రూ త‌న‌ను అర్హురాలు కాదని గుచ్చిగుచ్చి చెప్ప‌డాన్ని అరియానా పాజిటివ్‌గా తీసుకుంది. "నేను స్ట్రాంగ్ ప్లేయ‌ర్ అని ఇక్క‌డే తెలిసిపోతుంది. అంద‌రి బుర్ర‌లోకి దూరానంటే నేను గేమ‌ర్‌ను అని అర్థం. ఇది నాకు సంతోషాన్నిస్తోంది" అని చెప్పుకొచ్చింది. మ‌రి ఈ గేమ్ పూర్త‌య్యేస‌రికి ఎవ‌రిని అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించార‌నేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: అవినాష్‌ను కాద‌ని అభికే ఓటేస్తానంటోన్న బుల్లెట్ భాస్క‌ర్‌)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)